AP News: ప్రైవేటు బస్సుల్లో ఆకస్మిక తనిఖీలు.. అధికారులు లోపలకెళ్లి చూడగా.!
పండుగ సీజన్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ ఇబ్బడి ముబ్బడిగా రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో... నిలువునా దోచుకుంటున్నాయి. పండక్కి ఊరెళ్లే ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిలువు దోపిడీ చేసేస్తున్నాయి. చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నా..

పండుగ సీజన్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ ఇబ్బడి ముబ్బడిగా రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో… నిలువునా దోచుకుంటున్నాయి. పండక్కి ఊరెళ్లే ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిలువు దోపిడీ చేసేస్తున్నాయి. చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నా.. కనీస నిబంధనలు పాటించకుండా ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వారి స్వగ్రామాలకు వెళ్లే వాళ్ళు చాలామందే ఉంటారు. రైళ్లు, ఆర్టీసీ బస్సుల రద్దీ అమాంతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా ఆర్టీసీ మరో 250 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు 30.. విజయవాడకు 60, రాజమండ్రి, కాకినాడ రూట్‌లలో మరో 60 బస్సులు నడుపుతోంది. అన్నీ కూడా హౌస్ ఫుల్‌గా మారడంతో.. ఇక ప్రైవేట్ ట్రావెల్స్పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాల నుంచి చాలామంది ప్రయాణికులు స్వగ్రామాలకు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది ప్రైవేట్ ఆపరేటర్లు పాత వాహనం సత్రం బయటకు తీసి మరమ్మతులు చేసి రోడ్లపై తీసుకొస్తున్నట్టు ఆరోపణలు వెలువెత్తాయి. కనీసం నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు అందాయి. దీంతో అలర్ట్ అయ్యారు ఆర్టీయే అధికారులు.
ఆర్టీయే తనిఖీల్లో..!
విశాఖలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీయే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బస్సులను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. నిబంధనలు గాలికొదిలేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తూ.. జరిమానాలు విధిస్తున్నారు. సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బరి తెగిస్తున్నారు. సీజన్ కావడంతో అధిక టికెట్ చార్జీలు వసూలు చేసి సొమ్ము చేసుకోవడమే కాదు.. నిబంధనలను తుంగలోకి తొక్కి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఫిర్యాదులు అందడంతో ఆర్టీయే అధికారులు రంగంలోకి దిగారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రాజారత్నం ఆదేశాలతో.. విస్తృతంగా తనిఖీలు చేశారు. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు. ఆర్టీయే అధికారుల వివరాల ప్రకారం.. హెవీ లగేజ్ లోడ్ పెట్టడం, అధిక రేట్లు వసూళ్లు, నిబంధనలకు విరుద్ధంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించి ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టి సొమ్ము చేసుకుంటున్నట్టు గుర్తించారు అధికారులు.
దీంతో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన ఆర్టీయే విశాఖలో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. అగనంపూడి టోల్ ప్లాజా వద్ద.. తనిఖీలు చేస్తున్నారు. భోగి తొలి రోజే.. ఉదయం 4 నుంచి 8 గంటల వరకు.. స్పెషల్ డ్రైవ్ చేశారు. ఇప్పటి వరకు నిబంధనలు పాటించని 38 బస్సులను గుర్తించి కేసులను నమోదు చేశారు. నాలుగున్నర లక్షల జరిమానా విధించామని అన్నారు మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ హరిప్రసాద్. పండుగ సీజన్ అయ్యే వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామంటున్నారు అధికారులు. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..