Krishna District: యజమాని ఇంట్లోకి దూరిన తాచుపాము.. వెంటాడి చంపిన రాట్ వీలర్..కానీ
విశ్వాసానికి మారు పేరు కుక్క. మనం కొంచెం ప్రేమ చూపిస్తే చాలు.. శునకాలు జీవితాంతం వరకు మనల్ని కనిపెట్టుకుని ఉంటాయి.
విశ్వాసానికి మారు పేరు కుక్క. మనం కొంచెం ప్రేమ చూపిస్తే చాలు.. శునకాలు జీవితాంతం వరకు మనల్ని కనిపెట్టుకుని ఉంటాయి. ఆఖరికి పెంచిన వారికోసం తమ ప్రాణాలని కూడా అర్పించడానికి సిద్దపడతాయి. కుక్కల ప్రేమను, విశ్వాసాన్ని, ప్రేమను చాటిచెప్పే ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగుచూశాయి. తాజాగా కృష్ణా జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ కుక్క తన యజమాని ప్రాణాలు కాపాడడం కోసం విషసర్పంతో ఫైట్ చేసి చనిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఓ కుటుంబం రాట్ వీలర్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. అయితే, ఇటీవల ఆ శునకం యజమాని ఇంటి ఆవరణలోకి ఓ తాచుపాము చొరబడింది. అది పసిగట్టిన కుక్క దాని వెంటపడింది. పామును తరిమికొడుతూ చెట్లపొదల్లోకి వెళ్లింది. పామును నోట కరుచుకుని తెచ్చి చంపేసింది. కానీ, పాపం.. పాము కాటుకు గురై ఆ కుక్క కూడా చనిపోయింది.. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న శునకం చనిపోవడంతో.. ఆ కుటుంబం కన్నీరు పెట్టింది.
Also Read: ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకువచ్చిన 3 కొండచిలువలు.. గ్రామస్థులు ఏం చేశారంటే