Road Accident: కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
కడప జిల్లా చెన్నూరు సమీపంలో ఈరోజు సుమారు 12.45 గంటలకు సమయంలో కడప నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే పై ఆంధ్ర స్పైస్ హోటల్ కు కొద్ది దూరంలో ఆగిఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో మృగ్గురు మృతి చెందారు. కొండెటి కృష్ణ అనే అతను అతని కొడుకు స్పాట్ లోనే మృతి చెందగా కృష్ణ , భార్య కడప ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కూతురు , అత్త ఇద్దరూ మృత్యువుతో పోరాడుతున్నారు. వారి పరిస్దితి విషమంగా ఉండటంతో..
అతివేగము మధ్యాహ్న సమయంలో నిద్ర వచ్చి తోలడమో తెలియదు కానీ కనురెప్ప పాటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఆగి ఉన్న లారీని వెనుకలుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు మిగతా ఇద్దరూ మృత్యువుతో పోరాడుతున్నారు
కడప జిల్లా చెన్నూరు సమీపంలో ఈరోజు సుమారు 12.45 గంటలకు సమయంలో కడప నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే పై ఆంధ్ర స్పైస్ హోటల్ కు కొద్ది దూరంలో ఆగిఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో మృగ్గురు మృతి చెందారు. కొండెటి కృష్ణ అనే అతను అతని కొడుకు స్పాట్ లోనే మృతి చెందగా కృష్ణ , భార్య కడప ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కూతురు , అత్త ఇద్దరూ మృత్యువుతో పోరాడుతున్నారు. వారి పరిస్దితి విషమంగా ఉండటంతో వారిని కడప నుంచి విజయవాడకు తరలించారు.
స్దానికుల చెప్పిన దాని ప్రకారం లారీ డ్రైవర్ హైవేపై భోజనానికి ఆపిన సమయంలో కడప వైపునుంచి వస్తున్న కారు షడన్ గా అతివేగంతో వచ్చి ఆగిఉన్న లారీని ఢీకొట్టిందని. కారు ముందు భాగం అంతా నుజ్జు నుజ్దు అయు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి, ఆయన వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ అక్కడి కక్కడే స్పాట్ లో చనిపోగా డ్రావర్ పక్కసీట్లో కూర్చున్న మహిళ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మద్యలో చనిపోయిందని స్దానికులు చెప్పారు. వీరంతా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ కు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ గురుంచి భందువులకు సమాచారం ఇవ్వడంతో మృత్యువుతో పోరాడుతున్న ఇద్దరిని హుటాహుటీన విజయవాడ తరలించారు .. అయితే వీరి వద్ద చైతన్యా కాళాశాలకు చెందిని విజిటర్ పాస్ లు , వారి ఆధార్ కార్డులు లభించడంతో వాటి ఆధారంగా వీరు ఖైరతా బాద్ వారిగా పోలీసులు గుర్తించారు .
కారు అతివేగం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబం చిన్నబిన్నమైపోయింది .. అతివేగం కన్నా ప్రాణం మిన్న అని ఎంత చెబుతున్నా ప్రమాదాలు జరగడం మాత్రం ఆగడం లేదు ముఖ్యంగా కుటుంబంతో ప్రయాణమైనప్పుడు చాలా సేఫ్టీ డ్రైవింగ్ చేయాలని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి