AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor: పొలం నుంచి తిరిగొస్తుండగా రైతును చంపిన ఏనుగు.. విద్యుత్ షాక్‌తో మరో..

చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత రైతాంగానికి ఏనుగుల సంచారం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పెద్దపంజాణి మండలం ముదిరెడ్డిపల్లిలో రైతు దంపతులపై దాడి చేసిన ఏనుగు ఒకర్ని బలి తీసుకుంది. మృతి చెందిన రైతు మార్కండేయగా గుర్తించిన అటవీశాఖ సిబ్బంది. పొలం పనులు ముగించుకొని భార్య అరుణతో కలిసి ఇంటికి వెళుతుండగా ఓ ఒంటరి ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడి చేసిన సమయంలో భార్య అరుణ తప్పించుకోగా ఏనుగు దాడిలో భర్త మార్కండేయ మృతి చెందాడు. ఏనుగు దాడి సమాచారం..

Chittoor: పొలం నుంచి తిరిగొస్తుండగా రైతును చంపిన ఏనుగు.. విద్యుత్ షాక్‌తో మరో..
Elephant Attacked On Farmer
Raju M P R
| Edited By: Srilakshmi C|

Updated on: Aug 20, 2023 | 3:25 PM

Share

చిత్తూరు, ఆగస్టు 20: ఆరుగాలం పండించిన పంటను కాపాడుకోవడం ఆ జిల్లా రైతులకు గగనంగా మారింది. ఏనుగుల వరుస దాడుల్లో పంటను కాపాడుకునే క్రమంలో కొందరు తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. తాజాగా మరో రైతు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఓ ఎనుగు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. మరో ఘటనలో విద్యుత్ షాక్‌కు గురై మరో ఎనుగు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత రైతాంగానికి ఏనుగుల సంచారం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పెద్దపంజాణి మండలం ముదిరెడ్డిపల్లిలో రైతు దంపతులపై దాడి చేసిన ఏనుగు ఒకర్ని బలి తీసుకుంది. మృతి చెందిన రైతు మార్కండేయగా గుర్తించిన అటవీశాఖ సిబ్బంది. పొలం పనులు ముగించుకొని భార్య అరుణతో కలిసి ఇంటికి వెళుతుండగా ఓ ఒంటరి ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడి చేసిన సమయంలో భార్య అరుణ తప్పించుకోగా ఏనుగు దాడిలో భర్త మార్కండేయ మృతి చెందాడు. ఏనుగు దాడి సమాచారం గ్రామస్తులు అడవిశాఖ సిబ్బందికి ఇచ్చారు. గతంలో ఇదే చోట ఏనుగు దాడిలో ఇద్దరు మృతి చెందడం విశేషం. మార్కండేయ మృతితో ఆ సంఖ్య మూడుకు చేరింది.

మరో ఘటనలో.. విద్యుత్ షాక్‌కు గురై మరో ఏనుగు మృతి

మరో ఏనుగు బైరెడ్డిపల్లి మండలం నల్లగుంట్లపల్లె లో విద్యుత్ షాక్ గురై మృతి చెందింది. పంట పొలాలల్లోని విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టిన ఏనుగు విద్యుత్ షాక్ కు గురయింది. విద్యుత్ స్తంభం విరిగిపడడంతో విద్యుత్ తీగలు ఏనుగును తాకి విద్యుత్ షాక్ కు గురైనట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కౌండిన్య అభరణ్యం నుంచి బయటకు వస్తున్న ఏనుగులు తరచూ ప్రమాదాలకు గురై మృతి చెందడంతో అటవీ శాఖ ఆందోళన చెందుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.