AP Politics: గన్నవరం సీటుపై క్లారిటీ రాలేదా.. మనసు మార్చుకున్నారా.. యార్లగడ్డ వెంకట్రావు ఏమన్నారంటే..
Yarlagadda Venkata Ra: వైసీపీ కోసం ఆరేళ్ళు కష్టపడ్డానని.. పార్టీలో గౌరవం దక్కలేదని చెప్పారు రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ లో చేరుతున్నట్లు చెప్పారు. అయితే గన్నవరం నుంచే పోటీ చేస్తానని మాత్రం చెప్పలేదు. దీంతో సీటు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది.పార్టీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమని చెప్పినా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు యార్లగడ్డ వెంకట్రావు.
కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతున్నాయి. నారా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించడానికి ముందు ఆత్మీయ సమావేశం పేరిట బలనిరూపణకు దిగిన యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం లోనే రాజకీయాలు చేస్తానని ప్రకటించారు..ఆ తర్వాత ముఖ్య అనుచరులతో సమావేశమై వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన యార్లగడ్డ వెంకట్రావు హైదరాబాద్ వెళ్లి టీడీపీ అధినేత తో కలిశారు త్వరలోనే పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
వైసీపీ కోసం ఆరేళ్ళు కష్టపడ్డానని.. పార్టీలో గౌరవం దక్కలేదని చెప్పారు రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ లో చేరుతున్నట్లు చెప్పారు. అయితే గన్నవరం నుంచే పోటీ చేస్తానని మాత్రం చెప్పలేదు. దీంతో సీటు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది.పార్టీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమని చెప్పినా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు యార్లగడ్డ వెంకట్రావు.
యార్లగడ్డ మనసు మార్చుకున్నారా..
చంద్రబాబు తో భేటీ తర్వాత యార్లగడ్డ చేసిన వ్యాక్యలు కొత్త చర్చకు దారితీశాయి.నిన్న మొన్నటివరకూ గన్నవరం ప్రజలను వీడేది లేదు…2024 లో గన్నవరం నుంచే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు వెంకట్రావు.సొంత ప్రాంతం కాకపోయినా తనను ఇంతలా ఆదరిస్తున్న గన్నవరం ప్రజలకు సేవ చేసేందుకు ఇక్కడి నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.మరి చంద్రబాబు తో భేటీ తర్వాత యార్లగడ్డ మాత్రం గన్నవరం నుంచి పోటీ చేస్తానని మాత్రం చెప్పలేదు.చంద్రబాబు సీటుపై హామీ ఇవ్వకపోవడం తోనే యార్లగడ్డ చెప్పలేదని తెలుస్తుంది.
అంతే కాదు కొత్తగా గుడివాడ పేరును తెరపైకి తెచ్చారు.గన్నవరం లో వల్లభనేని వంశీ తో పాటు గుడివాడ లో కొడాలి నాని ని ఎలాగైనా ఓడించాలనేది తెలుగుదేశం పార్టీ గట్టి సంకల్పంగా పెట్టుకుంది.అందుకే చంద్రబాబు తో భేటీలో గుడివాడ ప్రస్తావన వచ్చి ఉండవచ్చని అనుమానం కలుగుతుంది. ప్రస్తుతం టీడీపీకి గన్నవరం, గుడివాడ నియజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేరు.గుడివాడ లో సీటు కోసం రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము పోటీ పడుతున్నారు.ఇక గన్నవరం స్థానంలో పోటీ కూడా లేదు.
ఈ రెండు స్థానాల్లో యార్లగడ్డ బలం లెక్కవేసిన తర్వాత సీటుపై హామీ ఇస్తానన్నారా అనే చర్చ కూడా మొదలైంది.గన్నవరం నియోజకవర్గం కార్యకర్తల ఎదుట ఎంతో ఆవేశంగా మాట్లాడిన యార్లగడ్డ మనసు మార్చుకుని గుడివాడ కు సై అంటారా?లేక గన్నవరం లో నారా లోకేష్ బహిరంగ సభలో ప్రకటన వస్తుందా చూడాలి.
గన్నవరం,గుడివాడలో బలాబలాలు ఏంటి?
యార్లగడ్డ వెంకట్రావు కు తెలుగుదేశం పార్టీ గన్నవరం టిక్కెట్ ఇస్తే ఇక్కడ హోరాహోరీ పోరు ఉంటుంది.ఇప్పటికే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ కేడర్ తో పాటు దుట్టా రామచంద్రరావు అనుచరులు,టీడీపీ కేడర్ కూడా యార్లగడ్డ కు పూర్తిగా మద్దతు ఇస్తాయి.దీనికి తోడు ఎక్కువ ఓట్లు ఉన్న విజయవాడ రూరల్ మండలంలో టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండటం కూడా తనకి కలిసొచ్చే అంశంగా యార్లగడ్డ భావిస్తున్నారు దీంతో గన్నవరం టిక్కెట్ అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందనేది యార్లగడ్డ వాదన. ఒకవేళ కొడాలి నానిపై పోటీకి యార్లగడ్డ ను దించితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని కూడా టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.మొత్తానికి యార్లగడ్డ విషయంలో టీడీపీ ఏం చేయనుందనేది ఉత్కంఠగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం