NTR District: గుడిమెట్లలో వజ్రాలు వేట.. వేలల్లో తరలివచ్చిన జనం.. ఎవరికి సుడి ఉందో..

NTR District: గుడిమెట్లలో వజ్రాలు వేట.. వేలల్లో తరలివచ్చిన జనం.. ఎవరికి సుడి ఉందో..

Ram Naramaneni

|

Updated on: Aug 20, 2023 | 4:33 PM

వజ్రాల వేటలో ఇటీవల ఓ ప్యామిలీకి లక్ కలిసొచ్చింది. 6 ముఖాలున్న షడ్భుజి వజ్రం దొరికింది. మార్కెట్లో ఈ వజ్రం రూ.60 లక్షలు పలికిందని ప్రచారం జరిగింది. దీంతో ఆదివారం వజ్రాల వేటకు జనాలు పోటెత్తారు. పొద్దు పొడవకముందే వేలాది ముందే అక్కడికి చేరుకున్నారు. అన్నాలు కట్టుకుని వచ్చి మరీ వజ్రాల వేట సాగిస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే తమ జీవితాలు మారిపోతాయని చెబుతున్నారు. వజ్రాల వ్యాపారులు సైతం అక్కడికి చేరుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 20:  ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో వజ్రాల వేట కోసం జనం పోటెత్తారు. దాదాపు 3 వేల నుంచి 5 వేల మంది వజ్రాల కోసం వెతుకులాట సాగిస్తున్నారు.  ఇటీవల పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తికి ఇక్కడ విలువైన వజ్రం దొరికింది.  గత వారం నుండి వజ్రలు దొరుకుతున్నాయని ప్రచారంతో వజ్రాల గుట్టకు భారీగా తరలివచ్చారు జనాలు.  ఆదివారం కావడంతో  తెల్లవారు జామున ఆరు గంటల నుండే వజ్రాల వేట షురూ చేశారు. అన్నం బాక్సులు కట్టుకుని వచ్చి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో వజ్రాల వ్యాపారులు  సైతం అక్కడికి క్యూ కట్టారు. వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్నవారికి విజిటింగ్ కార్డ్స్ ఇస్తూ.. డైమండ్ దొరికితే తమకు కాల్ చేయమని చెబుతున్నారు. ఈ గుడిమెట్లకు గతంలో ఏడు పేటలు, ఏడు కోటలు అని పేరు ఉండేదట. గుడిమెట్ల అప్పట్లో సమంత రాజుల రాజధానిగా ఉండేదని కొందరు చెబుతుంటారు వేములవాడ భీమ కవి శాపం కారణంగా గుడిమెట్లకు ప్రస్తుత దుస్థితి వచ్చిందని అంటారు. ఎన్నో విలువైన పురాతన వస్తువులు కూడా గుడిమెట్లలో దొరికాయని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు.

 

 

Published on: Aug 20, 2023 04:31 PM