AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఛా.. ఛా.. ఆ ఒక్క పొరపాటు.. నిండు జీవితానికి ముగింపు పలికేలా చేసింది..

సుఖంగా సాగిపోతున్న కుటుంబంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడి చేసిన ఒక్క తప్పటడుగు… చివరకు ప్రాణాలు తీసే విషాదానికి దారితీసింది. అనకాపల్లి జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగి పెట్టుబడి పెట్టిన 20 లక్షలు షేర్లలో నష్టపోవడంతో ఇంట్లో కలహాలు చెలరేగాయి. భవిష్యత్తుపై ఆందోళన చెందిన భార్య లక్ష్మీపార్వతి తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకొని జీవితాన్ని ముగించింది.

Andhra: ఛా.. ఛా.. ఆ ఒక్క పొరపాటు.. నిండు జీవితానికి ముగింపు పలికేలా చేసింది..
Lakshmi Parvathi
Maqdood Husain Khaja
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 29, 2025 | 4:28 PM

Share

ఈజీగా సంపాదన..! ఇదే ఇప్పుడు చాలామంది మదిలో మెదులుతున్న ఆలోచన. కొందరు సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోలేక నష్టపోతుంటే.. మరికొందరు నేరాల బాట పట్టి జైలు పాలవుతున్నారు. ఇంకొన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. తాజాగా.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి నష్టాన్ని తెచ్చి కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కలహాలకు కారణమైంది. చివరకు బలవన్మరణానికి దారితీసింది. భర్త ప్రవర్తనతో భార్య ఉసురు తీసుకుంది. అనకాపల్లి జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొంగ సింగి గ్రామానికి చెందిన.. రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్. రిటైర్మెంట్ తర్వాత తన చేతికి అందిన దాంట్లో కొంత నగదు పెట్టుబడి పెట్టాలని ఆలోచించాడు. షేర్ మార్కెట్లో పడితే కాస్త లాభాలు వస్తాయని అనుకొని 20 లక్షల రూపాయల షేర్లు కొనుగోలు చేశాడు. షేర్ మార్కెట్లో ప్రసాద్ నష్టాలను చవిచూశాడు. 15 ఏళ్లకు పైగా సర్వీస్ చేసి కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బు.. షేర్లలో అష్టపోవడంతో.. చేసిన అప్పులు తీర్చలేకపోయాడు.

రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన సొమ్ముతో శేష జీవితం హ్యాపీగా జీవిద్దామని అనుకుంది భార్య. భర్తతో చెప్పినా.. పెడ చెవిన పెట్టడంతో.. తీవ్రంగా కలత చెందింది. ఉన్న డబ్బుల పోగొట్టుకొని భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ భర్తను నిలదీసింది భార్య లక్ష్మీపార్వతి. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైంది. గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది లక్ష్మీపార్వతి. దీంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు భర్త, కుటుంబ సభ్యులు. మృతురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.