AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

prakasam barrage: బోట్ల కోసం పాట్లు.. భారీ పడవలను కట్ చేసేందుకు నానా తంటాలు.. నేడు రంగంలోకి మరో టీమ్..

ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ యుద్ధప్రాతిపాతినక కొనసాగుతోంది. అయితే ఈ ఆపరేషన్‌లో అడుకో సవాల్‌ ఎదురవుతోంది. దీంతో బోట్లు తొలగింపులో ఎక్స్‌పర్ట్స్‌ అయినా మరి కొంతమందిని రంగంలోకి దింపుతున్నారు.  ఈ బోట్ల తొలగింపు ప్రక్రియను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలిస్తున్నారు. అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ కొనసాగుతోతుందని తెలిపారు. కాకినాడ నుంచి బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులుని తీసుకొస్తున్నామని తెలిపారు. 

prakasam barrage: బోట్ల కోసం పాట్లు.. భారీ పడవలను కట్ చేసేందుకు నానా తంటాలు.. నేడు రంగంలోకి మరో టీమ్..
Prakasam Barrage Boat Incident (2)
Surya Kala
|

Updated on: Sep 13, 2024 | 6:55 AM

Share

ప్రకాశం బ్యారేజ్‌ గేట్ల దగ్గర ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపు బిగ్‌ ఛాలేంజ్‌గా మారింది. బోట్ల తొలగింపు ప్రక్రియ నిపుణుల నైపుణ్యానికి సవాల్‌ విసురుతోంది. డైవింగ్‌ టీమ్‌లు, అండర్‌ వాటర్‌లో కటింగ్ ఎక్విప్‌మెంట్లు, స్పెషలిస్టులు అంతా పదుల సంఖ్యలో యాక్షన్‌లోకి దిగి తీవ్రంగా శ్రమిస్తున్నా… బోట్ల తొలగింపు క్లిష్టంగా మారింది. ఎయిర్‌ బెలూన్లు పెట్టి బోట్లను పైకి తేవాలని భావించారు కానీ వాటర్‌ లెవల్‌ తగ్గిపోవడంతో అదీ కూడా సాధ్యం కాలేదు. దీంతో అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దాదాపు 12 అడుగుల నీటి లోపలకు వెళ్లి పడవలను స్కూబా టీం గ్యాస్‌ కట్టర్లతో కత్తిరిస్తోంది. మొత్తం కత్తిరిస్తే ముక్కలను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ముందు ఒక్కొక్క పడవ 40 టన్నులు ఉంటుందనుకున్నారు. కానీ ఒక్కొక్క పడవ 60 నుంచి 65 టన్నుల బరువు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.  ఇంత భారీ పడవను కట్ చేసేందుకు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.

ఈ బోట్ల తొలగింపునకు ముందే ఇంజనీర్లు ప్రణాళికలు రూపొందించారు. ప్లాన్‌లో భాగంగా బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా సాధ్య పడలేదు. ఇక చేసేది లేక అధికారులు ఆ బోట్లను ముక్కలు చేసే పనిని వేగవంతం చేశారు. అయితే బోట్లు చాలా దృఢంగా ఉండటంతో కొంతమేర మాత్రమే కట్ చేయగలిగారు. పడవ చుట్టుకొలత 40 మీటర్ల వరకు ఉందని అంచనా వేశారు. నీటి లోపల బోట్లకు అడ్డంగా భారీ ఇనుప గడ్డర్లు ఉండటంతో పనులు చాలా స్లోగా సాగుతున్నాయి. పడవ అడుగు భాగం మూడు లేర్లుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

ముందు ఒక బోటును కట్‌ చేయడం అయిపోయాక ఆ ముక్కలను భారీ క్రేన్లతో బయటకు వెలికి తీసి.. మరో రెండు పడవల కోతను మొదలుపెడతామని అధికారులు చెబుతున్నారు. ఈ బోట్ల తొలగింపు ప్రక్రియను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలిస్తున్నారు. అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ కొనసాగుతోతుందని తెలిపారు. కాకినాడ నుంచి బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులుని తీసుకొస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఒక్క బోటు ఖరీదు రూ.50 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇంత విలువైన పడవలు తమవేనని ఎవ్వరూ ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని అధికారులు తెలిపారు. ఈ బోట్లను తొలగించేందుకు, ధ్వంసమైన కౌంటర్‌ వెయిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..