Recording Dance:ఆలయ ప్రారంభోత్సవంలో రికార్డింగ్ డాన్యులు.. పోలీసులున్నా పట్టించుకోలేదని విమర్శలు
కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసారు. స్థానికంగా వందల మంది వచ్చారు. డీజే పాటలతో, యువతుల నృత్యాలతో హోరెత్తించారు. డాన్యులను చూసి తెగ ఎంజాయి..

కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసారు. స్థానికంగా వందల మంది వచ్చారు. డీజే పాటలతో, యువతుల నృత్యాలతో హోరెత్తించారు. డాన్యులను చూసి తెగ ఎంజాయి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు పక్కనే వున్న కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని చెబుతున్న పోలీసులు. కొన్నిచోట్ల ఇలా చూసీ చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఆలయం ప్రారంభ కార్యక్రమంలో ఈలాంటి రికార్డ్ డ్యాన్స్‌లు నిర్వహించడం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాత్రిపూట రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇదంతా జరిగింది ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామంలో. కందులాపురం గ్రామంలో ఓ గుడి ప్రతిష్టాపణ మహోత్సవం సందర్భంగా, ఆలయ నిర్వాహకులు ఈ విధంగా రికార్డింగ్ డాన్స్ లు ఏర్పాటు చేసి.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారు.
ఒకపక్క కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో.. ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా పాల్గొన్నారు స్థానికులు. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు మాత్రం రికార్డింగ్ డాన్స్ లను అరికట్టాల్సిన పోలీసులే పట్టీపట్టనట్లు వ్యవహరించటం పై పోలీసుల పై విమర్శలు వస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ నిర్వాహకులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: వీరిది సహాపంక్తి భోజనం.. తినడానికి పొంగలి.. రుచికరమైన వంటకాలు.. కానీ ప్లేట్లు.. విస్తరాకుల్లో కాదు.. మరీ ఎలా తింటారో తెలుసా..
Acharya Chanakya: నీరు.. డబ్బు.. ఒకటే.. సంపాదించిన సంపదను ఏం చేయాలో చెప్పిన చాణక్యుడు..