కోనసీమ కొబ్బరి చరిత్రలోనే అత్యధికంగా పెరిగిన ధరలు.. ఆనందంలో రైతన్నలు
పచ్చి కొబ్బరికాయలకు మునుపెన్నడూ లేనంతగా ధర వచ్చింది. కోనసీమ మార్కెట్ చరిత్రలో ఇది అరుదైన రికార్డుగా చెబుతున్నారు. 1000 కొబ్బరికాయలకు రూ.25 వేలు పలకగా ప్రాంతాలను బట్టి కొందరు వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కాయల పరిమాణం, నాణ్యత, బరువును బట్టి కొన్ని ప్రాంతాల్లో వెయ్యి పచ్చికాయలు రూ.25 వేలకు చేరువలో ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రికార్డు స్థాయిలో పెరిగిన కొబ్బరి కాయ ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ కొబ్బరి చరిత్రలోనే లేనంతగా అత్యధికంగా పెరిగిన పచ్చికొబ్బరి కాయ ధరలు మొదటిసారి అని రైతులు వ్యాపారాలు అంటున్నారు.వెయ్యి ఇంటికి 25వేల రూపాయలు ధర పలుకుతుందని ఇలాంటి ధరలు ఎన్నడూ చూడలేదంటున్నరు రైతులు, వ్యాపారులు. కొబ్బరి ఎక్కువగా పండే రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొబ్బరి దిగుబడి తగ్గడమే దీనికి ప్రధాన కారణం ఉన్నారు. రానున్న రోజులు దసరా, దీపావళి పండుగలు ,పెళ్లిళ్లు కావడంతో ఈ ధరలు మరింత పెరుగుతాయి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పెరగడంతో ధరలు పెరిగాయని ఎప్పటినుంచో కుదేలవుతున్న కొబ్బరి రైతులకు ఈ ధరలు ఆనందాన్ని ఇస్తున్నాయంటున్నరు కోనసీమ కొబ్బరి రైతులు..
పచ్చి కొబ్బరికాయలకు మునుపెన్నడూ లేనంతగా ధర వచ్చింది. కోనసీమ మార్కెట్ చరిత్రలో ఇది అరుదైన రికార్డుగా చెబుతున్నారు. 1000 కొబ్బరికాయలకు రూ.25 వేలు పలకగా ప్రాంతాలను బట్టి కొందరు వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కాయల పరిమాణం, నాణ్యత, బరువును బట్టి కొన్ని ప్రాంతాల్లో వెయ్యి పచ్చికాయలు రూ.25 వేలకు చేరువలో ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలలో కాయల పరిమాణం ఆశాజనకంగా ఉంటుందని వచ్చే నెలలో బాగా తగ్గిపోయి చిన్నవి వస్తాయి. దీంతో వర్తకులు రైతుల వద్ద నుంచి ఇప్పుడే పెద్దఎత్తున కొని నిల్వ చేసుకుంటున్నారు. రానున్న దసరాకు మంచి ధర వస్తుందని ఆశిస్తున్నారు.
మరోవైపు దిగుబడులు సన్నగిల్లాయి. గతంలో ఎకరాకు వెయ్యి కాయలు వస్తే ఇప్పుడు సగానికి తగ్గిపోయి కొరత ఏర్పడింది. దీంతో రోజుల వ్యవధిలోనే ధరలో పెరుగుదల కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు ఎగుమతులు జోరందుకున్నాయి. ఒకప్పుడు కొబ్బరి కొనేవారు లేక మూడు రూపాయలు ఐదు రూపాయలు ఉండే ధరలతో తోటలు మెయింటెనెన్స్ కే సరిపోక కొబ్బరి తోటలను ఆక్వా చెరువులకు ,రియల్ ఎస్టేట్ కు అమ్మేసిన రైతులు. మొత్తంగా ఇప్పుడు కోనసీమ కల్పవృక్షానికి మంచి రోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కోనసీమ కొబ్బరి రైతులు, వ్యాపారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




