AP Weather: ఉత్తర కోస్తాలో మోస్తారు వర్షాలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదే
ఏపీలో ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి.....
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రిపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————
సోమవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట సంభవించవచ్చును. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
మంగళవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
బుధవారం :-వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–
సోమవారం, మంగళవారం, బుధవారం:- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
రాయలసీమ :-
——————-
సోమవారం, మంగళవారం, బుధవారం:– వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..