Team India In 2025: ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్.. కొత్త ఏడాదిలో బిజి బిజీగా టీమిండియా.. ఫుల్ షెడ్యూల్ ఇదే

టీమ్ ఇండియా 2025 ప్రారంభంలోనే ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీని ఆడుతుంది. ఆ తర్వాత ధనా ధన్ లీగ్ ఐపీఎల్‌ సందడి మొదలు కానుంది. మొత్తానికి 2025లో టీమ్ ఇండియా వరుస సిరీస్‌లతో బిజి బిజీగా ఉండనుంది. ఇందులోఇంగ్లండ్‌తో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కూడా ఉంది.

Team India In 2025: ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్.. కొత్త ఏడాదిలో బిజి బిజీగా టీమిండియా.. ఫుల్ షెడ్యూల్ ఇదే
Team India
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2025 | 3:36 PM

కొన్ని అద్భుత విజయాలు, మరికొన్ని చేదు జ్ఞాపకాలతో టీమిండియా 2024ను ముగించింది. కొంగొత్త ఆశలతో 2025కు స్వాగత పలికింది. ఈ నూతన సంవత్సరంలో టీమిండియా తొలి ప్రత్యర్థి ఆస్ట్రేలియా. జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న సిడ్నీ టెస్టు మ్యాచ్‌తో టీం ఇండియా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు పలు టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇక్కడ ఉంది.

టీమిండియా- 2025 ఫుల్ షెడ్యూల్..

  • భారత్ vs ఆస్ట్రేలియా ( బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్ట్) – జనవరి 3 నుండి 7 (సిడ్నీ)

భారత్ vs ఇంగ్లండ్ (5 టీ20లు, 3 వన్డేలు)

  • 1వ టీ20: జనవరి 22 (చెన్నై)
  • 2వ టీ20: జనవరి 25 (కోల్‌కతా)
  • 3వ T20I: జనవరి 28 (రాజ్‌కోట్)
  • 4వ టీ20: జనవరి 31 (పుణె)
  • 5వ టీ20: ఫిబ్రవరి 2 (ముంబై)
  • 1వ వన్డే: ఫిబ్రవరి 6 (నాగ్‌పూర్)
  • 2వ వన్డే: ఫిబ్రవరి 9 (కటక్)
  • 3వ వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్)

ఛాంపియన్స్ ట్రోఫీ — ఫిబ్రవరి-మార్చి 2025

  • భారత్ vs బంగ్లాదేశ్: ఫిబ్రవరి 20 (దుబాయ్)
  • భారత్ vs పాకిస్థాన్: ఫిబ్రవరి 23 (దుబాయ్)
  • భారత్ vs న్యూజిలాండ్: మార్చి 2 (దుబాయ్)
  • సెమీ-ఫైనల్ (అర్హత సాధిస్తే): మార్చి 4 (దుబాయ్)
  • ఫైనల్ (అర్హత సాధిస్తే): మార్చి 9 (దుబాయ్)

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (అర్హత సాధిస్తే)

  • జూన్ 11 నుండి 15, 2025 (లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్)
ఇవి కూడా చదవండి

భారత్ vs ఇంగ్లండ్ (5 టెస్టులు)

  • 1వ టెస్ట్: జూన్ 20-24 (హెడింగ్లీ)
  • 2వ టెస్టు: జూలై 2-6 (ఎడ్జ్‌బాస్టన్)
  • 3వ టెస్ట్: జూన్ 10-14 (లార్డ్స్)
  • 4వ టెస్ట్: జూన్ 23-27 (మాంచెస్టర్)
  • 5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 (ఓవల్)
  • భారత్ vs బంగ్లాదేశ్ (3 వన్డేలు, 3 టీంలు) — ఆగస్టు 2025
  • భారత్ vs వెస్టిండీస్ (2 టెస్టులు) — అక్టోబర్ 2025
  • ఆసియా కప్ T20 టోర్నమెంట్ — అక్టోబర్-నవంబర్ 2025
  • భారత్ vs ఆస్ట్రేలియా (3 వన్డేలు, 5 టీ20లు) — నవంబర్2025
  • భారతదేశం vs దక్షిణాఫ్రికా (2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు) — నవంబర్-డిసెంబర్.

ఈ టోర్నీలకు సంబంధించి ఇంకా అధికాకారిక షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..