Guntur: డాక్టర్ చేస్తాం.. అగ్గువకే సీట్లు.. అంటూ వస్తారు.. చివరకు ఏం జరుగుతుందో తెలుసా..?

మెడిసిన్ చదవాలనుకున్న విద్యార్థులే టార్గెట్‌గా దొంగ ముఠాలు రెచ్చిపోతున్నారు. తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదివేందుకు అవకాశం కల్పిస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బుల దండుకుంటున్నారు. తీరా వెళ్లాక కాలేజీల్లోకి అనుమతించకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు కేంద్రంగా సాగుతున్న దందాకు పోలీసులు చెక్ పెట్టారు.

Guntur: డాక్టర్ చేస్తాం.. అగ్గువకే సీట్లు.. అంటూ వస్తారు.. చివరకు ఏం జరుగుతుందో తెలుసా..?
Guntur Crime
Follow us
T Nagaraju

| Edited By: Balaraju Goud

Updated on: Jan 01, 2025 | 2:05 PM

విదేశాల్లో మెడిసిన్ చదువుకోసం ప్రతి ఏటా వేలాది మంది తెలుగు రాష్ట్రాల నుండి వెళుతుంటారు. ఈ క్రమంలోనే కన్సల్టెన్సీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఫిలిఫ్పైన్స్ తోపాటు యూరప్ దేశాల్లో మెడిసిన్ చదవటానికి తక్కువ ఖర్చు అవుతుందని కన్సల్టెన్సీలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో మధ్యతరగతి వారు తమ పిల్లలను విదేశాలకు పంపి మెడిసిన్ చదివించాలని ఆశ పడుతన్నారు. పెద్ద మొత్తంలో ఫీజుల చెల్లించి, పిల్లలను పంపించేందుకు సిద్ధమైన తల్లిదండ్రులకు భారీ షాక్ తగిలింది.

విదేశాల్లో మెడిసిన్ చదివించాలనుకున్న తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని కొన్ని కన్సల్టెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇష్టం వచ్చినట్లు బాధితుల వద్ద నుండి వసూలు చేస్తున్నాయి. గుంటూరుకు చెందిన రైట్ ఛాయిస్ కన్సల్టెన్సీ గత కొంతకాలంగా ఫిలిప్పైన్స్‌లో మెడిసిన్ చదువుకునేందుకు విద్యార్ధులను పంపుతోంది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు తన కొడుకు అనిల్ కుమార్‌ను ఫిలిఫ్పైన్స్ పంపించేందుకు సిద్దమై, రైట్ ఛాయిస్ నిర్వాహకుడు కన్నా రవితేజ ను కలిశాడు. తక్కువలోనే ఖర్చువుతుందని రవితేజ నమ్మబలికాడు. అనిల్ కుమార్ ను ఫిలిఫ్పైన్స్ పంపించారు.

అక్కడ కాలేజ్ ఫీజ్, హాస్టల్ మొత్తం తామే చెల్లిస్తామని అందుకు గాను రూ. 21,59,000 అవుతుందని చెప్పి ఆ డబ్బులు కట్టించుకున్నారు. అయితే ఆ మొత్తాన్ని రవితేజ చదువుతున్న కాలేజ్‌లో రైట్ ఛాయిస్ నిర్వాహకులు చెల్లించలేదు. దీంతో అనిల్ కుమార్ ను కాలేజ్‌కు రానివ్వడం లేదు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు తన కుమారుడి ఫీజ్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాడు. శ్రీనివాసరావు చెప్పిన వినకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా పాస్ పోర్ట్ మావద్దే ఉందని బెదిరింపులకు దిగారు నిర్వహకులు. దీంతో మోసపోయామని గ్రహించిన శ్రీనివాసరావు పోలీసులను అశ్రయించాడు.

రంగంలోకి దిగిన వట్టిచెరుకూరు పోలీసులు రవితేజ తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. రవితేజ పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తామని గుంటూరు సౌత్ డిఎస్పీ మల్లిఖార్జున రావు చెప్పారు. విద్యార్ధుల పాస్ పోర్ట్ లు నిర్వాహకుల వద్ద ఉంచుకుని వారి తల్లిదండ్రులను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి మోసం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. త్వరలోనే ఫిలిఫ్పైన్స్ లో ఉన్నవారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. భోగస్ కన్సల్టెన్సీల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం