Weather Alert: అక్కడ వర్షాలు.. ఇక్కడ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం!
వర్షాలు ఇక లేనట్టే.. మళ్లీ ముదరనున్న ఎండలు.! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. కొద్దిరోజులగా చిన్నపాటి వర్షంతో కాస్తా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. అయితే తిరిగి మరోసారి ఎండలు తమ ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

వర్షాలు ఇక లేనట్టే.. మళ్లీ ముదరనున్న ఎండలు.! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. కొద్దిరోజులగా చిన్నపాటి వర్షంతో కాస్తా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. అయితే తిరిగి మరోసారి ఎండలు తమ ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాయి. రెండు రోజుల నుంచి పగలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికి రానున్న రెండు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చెప్పింది.
ఉత్తరకోస్తా, రాయలసీమలో మాత్రం మోస్తరు వర్షలు పడే అవకాశముంది. అటు మంగళవారం రాష్ట్రంలోని 149 మండలాలు, అలాగే బుధవారం 195 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు తెలంగాణలోనూ ఎండల తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో సాధారణంకంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంటోంది.
ఇది చదవండి: ధైర్యవంతులే చూడండి.! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 పాములు.. ఒకే చోట చేరి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








