Viral: రోడ్డుపై అనుమానాస్పదంగా గోనె సంచి.. పెట్రోలింగ్ పోలీసులు విప్పి చూడగా.!

అదొక నిర్మానుష్య రోడ్డు.. ఎప్పటిలానే ఆరోజు పెట్రోలింగ్ చేస్తున్న కొంతమంది పోలీసులకు అనుమానాస్పద రీతిలో ఓ గోనె సంచి కనిపించింది. అందులో ఏముందోనని వారు విప్పి చూడగా.. దెబ్బకు దిమ్మతిరిగిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

Viral: రోడ్డుపై అనుమానాస్పదంగా గోనె సంచి.. పెట్రోలింగ్ పోలీసులు విప్పి చూడగా.!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: May 28, 2024 | 8:12 AM

అదొక నిర్మానుష్య రోడ్డు.. ఎప్పటిలానే ఆరోజు పెట్రోలింగ్ చేస్తున్న కొంతమంది పోలీసులకు అనుమానాస్పద రీతిలో ఓ గోనె సంచి కనిపించింది. అందులో ఏముందోనని వారు విప్పి చూడగా.. దెబ్బకు దిమ్మతిరిగిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

వివరాల్లోకెళ్తే.. ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తి(53) తన కంటే నాలుగేళ్లు వయస్సు పెద్దదైన ఓ మహిళతో సహజీవనం చేస్తూ వచ్చాడు. మూడు రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో కన్నుమూయడంతో.. అతడు ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఇక ఆ తర్వాత కొద్దిరోజులకు ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని.. ఇరుగుపొరుగు వారు ఆరా తీయడంతో భయపడ్డ అతడు.. ఓ రాత్రివేళ ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కేసి.. ఇంటికి కాస్త దూరంలో ఉన్న నిర్మానుష్య రోడ్డుపై వదిలేసి.. ఎటో వెళ్లిపోయాడు. ఆదివారం రాత్రి పెట్రోలింగ్ పోలీసులు ఆ గోనె సంచిని గుర్తించారు.

అనంతరం పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని.. కాలేయ వ్యాధితో మరణించినట్టు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. ఇక సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అంత్యక్రియలకు డబ్బుల్లేక ఇలా చేసినట్టు చెప్పుకొచ్చాడు. అతడి మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని ఏసీపీ వెల్లడించారు. కాగా, ఆ మహిళకు దగ్గరుండి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: మీ ఐ పవర్‌కు పదునెంత.? దమ్ముంటే ఈ ఫోటోలోని చిరుతను కనిపెట్టండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
అదానీపై కేసుతో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం..
అదానీపై కేసుతో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం..
'పెట్టుబడులకు గుజరాత్ ప్రపంచ వేదికగా మారింది'.. గుజరాత్‌ సీఎం
'పెట్టుబడులకు గుజరాత్ ప్రపంచ వేదికగా మారింది'.. గుజరాత్‌ సీఎం
విమానంలో సిగరెట్‌ తాగాడు.. ఆ తర్వాత ??
విమానంలో సిగరెట్‌ తాగాడు.. ఆ తర్వాత ??