AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Fraud: ఇదో కొత్త రకం సైబర్ మోసం.. అదమరిస్తే అంతే సంగతులు.. కార్డ్ అక్టివేషన్ పేరుతో ఖాతా ఖాళీ!

ఎంతగా చైతన్యం తెస్తున్నప్పటికీ, భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ, రోజురోజుకూ సైబర్‌ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసు శాఖ, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్‌ మోసాల బారిన పడుతూనే ఉన్నారు.

Cyber Fraud: ఇదో కొత్త రకం సైబర్ మోసం.. అదమరిస్తే అంతే సంగతులు.. కార్డ్ అక్టివేషన్ పేరుతో ఖాతా ఖాళీ!
Cyber Crime
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: May 28, 2024 | 11:52 AM

Share

ఎంతగా చైతన్యం తెస్తున్నప్పటికీ, భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ, రోజురోజుకూ సైబర్‌ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసు శాఖ, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్‌ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నా నూరిళ్ల, రిజ్వనా అనే దంపతులను సైబర్ నేరగాళ్లు భలే బురిడీ కొట్టించారు. నూరిళ్ల, భార్య రిజ్వనాకు చెరో ఒకటి RBL బ్యాంకు నుండి క్రెడిట్ కార్డులు ఇంటికి వచ్చాయి. ఆ తరువాత వాటిని యాక్టివేట్ చేయాలని సైబర్ నేరగాళ్ళు భార్య, భర్తలకు ఇద్దరికీ కాల్ చేసి నమ్మబాలికారు. వారిని నమ్మిన నూరిళ్ల తన సెల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీలు వారికీ చెప్పడంతో వెంటనే అకౌంట్ నుండి మొదటిసారి రూ.51,445,రెండవ సారి రూ.51,475 ఇలా విడతల వారీగా రూ.1,85,000 నగదు మొత్తం కాజేశారు. తన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవడాన్ని గమనించిన నూరిళ్ల తాను మోసపోయానని గ్రహించారు. దీంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్