Python Surgery: చేపల కోసం వెళ్లి వలలో చిక్కిన కొండచిలువకు తీవ్ర గాయాలు.. ఎక్స్ రే..స్కానింగ్.. సర్జరీ చేసిన డాక్టర్..
గాయాలతో బాధపడుతూ నిరసించిపోయి ఊపిరి పోయే స్థితిలో ఉన్న కొండచిలువకు.. మురళి నగర్ తీసుకెళ్లాడు. అక్కడ పెట్ క్లినిక్ లో కొండచిలువకు చూపించాడు. జంతు ప్రేమికుడు, వెటర్నరీ డాక్టర్ అయిన మొహమ్మద్ జాకీర్.. కొండచిలువకు వైద్యం ప్రారంభించారు. వల శరీరమంతా పూర్తిగా చుట్టుకుపోయి బయటపడినప్పటికీ కదలని స్థితిలో ఉండంతో.. ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయా అన్న దానిపై ఫోకస్ పెట్టారు. కొండచిలువకు స్కానింగ్ ఎక్స్రే తీశారు.
పదిహేను అడుగుల పైగా పొడవున్న భారీ కొండచిలువ..! రెండు రోజుల క్రితం గాయాలతో నిరసించిన స్థితిలో కనిపించింది. శరీరం అంతా చేపల వల వైర్లు చుట్టుకొని ఊపిరి పోయేంత పని అయింది. దీంతో ఆ పామును వలనుంచి చాకచక్యంగా బయటకు తీసిన ఆ వ్యక్తి.. పాము గాయాలతో చనిపోయే స్థితిలో ఉంటే దానికి సపర్యలు చేశాడు. పశు వైద్యుడు సహకారంతో పాము కు తగిలిన గాయాలకు సర్జరీ చేయించాడు. గంటకు పైగా కొండచిలువకు సర్జరీ చేసి కుట్లు వేశారు. – విశాఖ భీమిలి ప్రాంతంలోని ఓ ఆశ్రమం వెనుక పొదల్లో.. కొండచిలువ కనిపించింది. శబ్దాలు రావడంతో వెళ్లి చూసిన వారికి.. చేపల వలలో చిక్కుకొని కొండచిలువ ఉన్నట్టు కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు.. స్నేక్ క్యాచర్ కిరణ్ కు కాల్ చేశారు. హుటాహుటిన అక్కడకు వెళ్లి.. చూసేసరికి అప్పటికే కొండ చిలువ నీరసించి పోయినట్టు గుర్తించారు. శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. ఒకవైపు నీరసించినప్పటికీ.. కసితో కోపంలో కనిపిస్తోంది. కొండచిలువ శరీరమంతా వాళ్లకు చెందిన వైర్లతో పూర్తిగా చుట్టుకుని ఉంది. దీంతో ఒక్కో వైరు తొలగించేసరికి దాదాపుగా 40 నిమిషాల సమయం పట్టింది. ఎట్టకేలకు వలను కత్తిరించి కొండచిలువ బయటకు తీసినప్పటికీ.. గాయాలయ్యాయి. దీంతో కొండచిలువకు సపర్యలు చేశారు.
గాయంతో బయటకు వచ్చిన పాము పేగులు..
అత్యంత చాకచక్యంగా వల నుంచి భారీ కొండచిలువను బయటకు తీసిన.. కిరణ్.. దానికి అప్పటికప్పుడే సపర్యలు చేశాడు. గాయం నుంచి బయటకు వచ్చిన పేగులను పొట్టలోకి చూపించి.. పసుపు రాసి వస్త్రంతో కట్టు కట్టాడు. ఆ తర్వాత పశు వైద్యుడు వద్దకు తీసుకెళ్లాడు.
కొండచిలువకు ఎక్స్ రే.. స్కానింగ్..!
గాయాలతో బాధపడుతూ నిరసించిపోయి ఊపిరి పోయే స్థితిలో ఉన్న కొండచిలువకు.. మురళి నగర్ తీసుకెళ్లాడు. అక్కడ పెట్ క్లినిక్ లో కొండచిలువకు చూపించాడు. జంతు ప్రేమికుడు, వెటర్నరీ డాక్టర్ అయిన మొహమ్మద్ జాకీర్.. కొండచిలువకు వైద్యం ప్రారంభించారు. వల శరీరమంతా పూర్తిగా చుట్టుకుపోయి బయటపడినప్పటికీ కదలని స్థితిలో ఉండంతో.. ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయా అన్న దానిపై ఫోకస్ పెట్టారు. కొండచిలువకు స్కానింగ్ ఎక్స్రే తీశారు. అదృష్టవశాత్తు ఎముకలేవి ఫ్రాక్చర్ కాలేదు. కానీ వలలో చిక్కుకున్న ఆ కొండచిలువకు కండరాలు దెబ్బతిన్నాయి.
గంట పాటు చికిత్స ఐదు కుట్లు..!
గాయాలతో నిరసించిన ఈ భారీ కొండచిలువకు.. బరువు చూశారు. దాదాపుగా 6:30 కిలోలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. హెల్దిగా ఉన్న కొండచిలువ ఇలా గాయాలపాలై కదలని స్థితికి వెళ్లడంతో.. అవసరమైన అన్ని వైద్య సేవలు అందించారు. చెక్కుకు పోయిన పొట్ట భాగానికి ఐదు కోట్లు వేశారు. ఇన్ఫెక్షన్ సోకకుండా మందులు రాసి.. గాయానికి డ్రెస్సింగ్ చేశారు. దెబ్బతిన్న కండరాలు సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రత్యేక సపర్యలు చేశారు. ఆ తర్వాత ఆ పామును అబ్జర్వేషన్ లో ఉంచారు.
ఇప్పటికే వేల సంఖ్యలో పాములో పట్టుకుని అడవుల్లో వదిలిన ఈ స్నేక్ క్యాచర్ కిరణ్.. ఎక్కడ పాము ఉందని సమాచారం ఇచ్చినా వెంటనే అక్కడ వాలిపోతాడు. తనకు తోచిన సహకారం అందించి ఆ పాములను సేఫ్గా జనావాసాలకు దూరంగా విడిచి పెడుతుంటాడు. ప్రస్తుతం ఈ కొండచిలువ కూడా గాయాలతో కనిపించడంతో చలించి పోయాడు. వైద్యం పూర్తవ్వడంతో.. కోలుకున్న తర్వాత.. అడవుల్లో విడిచిపెడతానని టీవీ9 తో చెప్పాడు కిరణ్. పర్యావరణ సమతుల్యత, జీవవైవిద్యంలో పాములు కూడా ఒక భాగం అని చెబుతున్నాడు.
విశాఖలో గాయపడిన కొండచిలువను కాపాడడం కోసం కిరణ్ పడిన కష్టానికి ఆ డాక్టర్ కూడా సహకారం అందించాడు. ప్రైవేట్ క్లినిక్ అయినప్పటికీ .. ఆ పామును చూసి చలించిపోయి ఉచితంగానే వైద్య సేవలు అందించాడు. సర్జరీ చేశాడు ఆ వైద్యుడు. ఇప్పుడు ప్రాణాపాయం నుంచి పూర్తిగా ఆ కొండచిలువ బయటపడింది. గాయాలతో కోలుకుంటుంది. మనిషికి గాయమైతే నోరు విప్పి చెప్పుకుంటాడు. కానీ ఇటువంటి మూగజీవాలకు గాయపడితే పరిస్థితి ఏంటి..? మూలుగుతూ ప్రాణాలు విడవడమే..! అటువంటి పరిస్థితుల్లో దానికి సపర్యలు చేసి ప్రాణాపాయం నుంచి గట్టెక్కించడం ఆ జంతు ప్రేమికులకు సలాం చేయాల్సిందే..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..