Chandrababu Naidu Arrest: స్కిల్ స్కామ్ కేసులో ముగిసిన వాదనలు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..
స్కిల్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టు అనంతరం.. ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు ముగిశాయి. టీడీపీ అధినేత చంద్రబాబును ఉదయం ఆరు గంటలకు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు సీఐడీ అధికారులు. ఉదయం నుంచి చంద్రబాబు, సీఐడీ తరపున లాయర్లు వాదనలు వినిపించారు.
స్కిల్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టు అనంతరం.. ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు ముగిశాయి. టీడీపీ అధినేత చంద్రబాబును ఉదయం ఆరు గంటలకు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు సీఐడీ అధికారులు. ఉదయం నుంచి చంద్రబాబు, సీఐడీ తరపున లాయర్లు వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలో న్యాయస్థానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తన అరెస్ట్ అక్రమమని చంద్రబాబు వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్‌తో తనకెలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు హాల్‌లో ఉంటారా లేదా అని చంద్రబాబును న్యాయమూర్తి అడగడంతో, కోర్టు హాల్‌లోనే ఉంటానన్నారు చంద్రబాబు.
చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. PC యాక్ట్ ప్రకారం 7 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలని.. నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే.. వెంటనే బెయిల్‌పై విచారణ జరపాలన్నారు. A-37పై 34 అభియోగాలు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం అంటున్నారు చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా. చంద్రబాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి కావాలని.. గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్టు చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితమని.. కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఐవైఆర్ కృష్ణారావుస్టేట్‌మెంట్‌ను కోర్టులో ప్రస్తావించారు లూథ్రా. ఈ కేసులో IPC సెక్షన్ 409 పెట్టడం సరికాదన్నారు. IPC సెక్షన్ 409 పెట్టాలంటే సరైన ఆధారాలు చూపాలన్నారు.
సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు ఏఏజీ పేర్కొన్నారు. స్పీకర్‌కు సమాచారం ఇస్తే సరిపోతుందని.. అరెస్టుకు ముందు అన్ని నియమాలను పాటించినట్లు ఏఏజీ తెలిపారు.
మరోవైపు ఏసీబీ కోర్టు దగ్గర భారీగా బలగాలు మోహరించారు. చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఏసీబీ కోర్టుకు వచ్చిన సీపీ క్రాంతిరాణా.. బందోబస్తును పరిశీలించారు.