AP News: ఉపాధి హామీ కూలీలకు వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా..
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. మండలంలోని లక్కవరం గ్రామ లో ఉపాధి హామీ కూలీల పైకి కొండచిలువ బుసలు కొట్టింది..
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. మండలంలోని లక్కవరం గ్రామ లో ఉపాధి హామీ కూలీల పైకి కొండచిలువ బుసలు కొట్టింది.గ్రామములోని నల్ల చెరువు కాలువలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా.. కాలువలోని తుప్పల్లో పెద్దగా శబ్దం చేస్తూ కొండచిలువ తారసపడిoది.భారీ కొండచిలువను చూసిన ఉపాధి హామీ కూలీలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొండ చిలువను చూసిన మహిళా కూలీలు పరుగులు పెట్టారు.
వెంటనే తేరుకున్న తోటి కూలీలు దాన్ని బయటకు లాగి కర్రలతో కొట్టి హతమార్చారు. కొండచిలువ పొడవు సుమారు 10 అడుగులు ఉంటుంది. కాలువలో తాబేళ్ల సంచారం ఎక్కువగా ఉండటంతో వాటి కోసo కాలువలో తిష్ట వేసింది కొండ చిలువ. సమీపంలో మహేంద్ర తనయ నదీ ఉండటంతో నదీతీరం నుండే కొండ చిలువ చొరబడి ఉంటుoదని గ్రామస్తులు భావిస్తున్నారు. కొండచిలువను ఖతం చేయటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువ నివాస సముదాయాలలోకి చొరబడి ఉంటే మనుషులకు, పశువులకు ప్రాణ నష్టం జరిగి ఉండేదనీ చర్చించుకుంటున్నారు.