AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరే మారతారా.. నన్ను మార్చేయమంటారా? అధికారులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..!

మీరు మారుతారా..? నన్ను మార్చమంటారా..? ప్రజాప్రతినిధులకు తొత్తులుగా పనిచేయకండి, ప్రజల కోసం పని చేయండి అంటూ ఎమ్మెల్యే అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో లాగా అదే లెక్కలో పనిచేస్తే మీ లెక్కలు మార్చాల్సి వస్తుంది అంటూ అధికారులకు తేల్చి చెప్పారు.

మీరే మారతారా.. నన్ను మార్చేయమంటారా? అధికారులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..!
Proddatur Mla Varadarajulu Reddy
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jun 27, 2024 | 1:00 PM

Share

మీరు మారుతారా..? నన్ను మార్చమంటారా..? ప్రజాప్రతినిధులకు తొత్తులుగా పనిచేయకండి, ప్రజల కోసం పని చేయండి అంటూ ఎమ్మెల్యే అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో లాగా అదే లెక్కలో పనిచేస్తే మీ లెక్కలు మార్చాల్సి వస్తుంది అంటూ అధికారులకు తేల్చి చెప్పారు. గత ఐదేళ్లలో చేసిన అవినీతి భాగోతాలు పక్కన పెట్టండి. లేదంటే మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది అంటూ గట్టిగానే చెప్పాడంట. పద్ధతులు మార్చుకోకపోతే పరిస్థితులు మారతాయని అవసరమైతే వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ చేయించుకోండి తప్పా ఇక్కడ అదే పందాలు ఉంటే కుదరదు అంటూ తనదైన శైలిలో అధికారులకు గట్టి వార్నింగ్ ఆ ఎమ్మెల్యే

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అధికారులకు తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై అధికారులందరూ లెక్క చెప్పాల్సిందేనని అన్నారు. ప్రజా సమస్యల కోసం కాకుండా ప్రజా ప్రతినిధుల కోసం పని చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వరద గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంట. గత నాలుగు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో జరిగిన రివ్యూ సమావేశంలో వరదరాజుల రెడ్డి పాల్గొని ప్రతి ఒక్క అధికారులు పేరుపేరునా పిలుస్తూ గత ఐదేళ్లు చేసిన అవినీతి చాలని ఇప్పుడు జరగబోయే పాలనంత పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జరగాలన్నారు.

ప్రజాప్రతినిధుల కోసం పనిచేయడం పక్కన పెట్టాలని, ప్రజల కోసం మాత్రమే పనిచేయాలని ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఎక్కడికైనా బదిలీ చేయించుకుని వెళ్లిపోండీ, ఇక్కడైతే ఉండొద్దని, ఇకపై నిత్యం ప్రజల కోసమే పని చేయాలన్నారు. గత ఐదేళ్లలో ఏమేమి జరిగాయో మొత్తం అంతా కొద్ది రోజులలో రెడీ చేసి ఫైల్స్ అందజేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గం లోని మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో వరద రివ్యూ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లు స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అయితే అవన్నీ అధికారులు కనుసన్నంలోనే జరిగాయన్నారు. అందుకే అధికారుల తీరు మార్చుకోవాలని స్పష్టంగా చెప్పానని చెప్పారు. లేదంటే వారే ఇక్కడ నుంచి మారిపోయి వెళ్ళొచ్చని బాహాటంగానే వారికి తెలియజేశానని వరదరాజుల రెడ్డి అన్నారు.

ఇప్పటినుంచి అధికారులంతా పారదర్శకంగా పనిచేయాల్సిందేనని ఈ ఐదేళ్లలో ప్రొద్దుటూరు ప్రజలకు సంబంధించి ఏ సమస్య ఉన్న వారు తక్షణం స్పందించాలని అదేశించామన్నారు. అంతేకాక ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్క అధికారి కూడా నడుం బిగించాలని వారికి సూచించినట్లు చెప్పారు. అంతేకాకుండా అవినీతి విషయంలో ఎవరెవరు గత ప్రభుత్వంలో సహకరించిన అధికారులు ఉన్నారో వారందరికీ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చామన్నారు. పద్ధతి మార్చుకోవాలని చెప్పామని, ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే బాహటంగానే వారిని ఇక్కడి నుంచి పంపించేస్తామన్నారు.

ఏది ఏమైనా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు విషయంలో అధికారులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..