‘రెడ్ బుక్’పై తొలిసారి స్పందించిన ఏపీ హోం మంత్రి అనిత.. 

రెడ్ బుక్‎పై స్పందించారు ఏపీ హోం మంత్రి అనిత. రెడ్ బుక్ అనేది కక్షసాధింపు కాదని గత ప్రభుత్వంలో సరిగా పనిచేయని అధికారుల పేర్లు అందులో ఉంటాయన్నారు. తాము ఎక్కడా కక్షసాధింపు చర్యలకు దిగడం లేదని స్పష్టం చేశారు. తమ నాయకుడి మాటకు విలువిచ్చి సంయమనంగా ఉన్నామన్నారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రజలకు చాలా నమ్మకం ఉందన్నారు. అందుకే కూటమికి 175 స్థానాలకుగానూ 164 స్థానాల్లో గెలిపించారన్నారు.

'రెడ్ బుక్'పై తొలిసారి స్పందించిన ఏపీ హోం మంత్రి అనిత.. 
Home Minister Anita
Follow us

|

Updated on: Jun 27, 2024 | 2:56 PM

రెడ్ బుక్‎పై స్పందించారు ఏపీ హోం మంత్రి అనిత. రెడ్ బుక్ అనేది కక్షసాధింపు కాదని గత ప్రభుత్వంలో సరిగా పనిచేయని అధికారుల పేర్లు అందులో ఉంటాయన్నారు. తాము ఎక్కడా కక్షసాధింపు చర్యలకు దిగడం లేదని స్పష్టం చేశారు. తమ నాయకుడి మాటకు విలువిచ్చి సంయమనంగా ఉన్నామన్నారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రజలకు చాలా నమ్మకం ఉందన్నారు. అందుకే కూటమికి 175 స్థానాలకుగానూ 164 స్థానాల్లో గెలిపించారన్నారు. వారి నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. ముందుగా  పోలీసు వ్యవస్థ తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చని తెలిపారు. కానీ గత ఐదేళ్లుగా వ్యవస్థలన్నీ దుర్వినియోగం అయ్యాయన్నారు మంత్రి వంగలపూడి అనిత. కనీసం చెక్‌పోస్ట్‌ల దగ్గర సీసీ కెమెరాలు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. అలాగే తమ ప్రభుత్వం ప్రధాన ఎజెండా గంజా నిర్మూలన, మహిళా భద్రత, పోలీసులకు సౌకర్యాలు, పోలీసుశాఖలో దరఖాస్తుల భర్తీ అన్నారు. గత ప్రభుత్వంలో పోలీసు స్టేషన్ల కనీస అవసరాలకు రూ. 8వేలు కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఒక్కో పోలీసు స్టేషన్ కనీస అవసరాల నిమిత్తం నెలసరి ఖర్చుకు రూ. 75వేలు ఇస్తున్నారని చెప్పారు.

అంతస్థాయిలో తాము ఇవ్వలేకపోయినా గతంలో ఇచ్చిన రూ. 8వేలు అయినా ఇవ్వాలని తెలిపారు. గత ప్రభుత్వం ఎస్కార్ట్ వాహనాల మరమ్మత్తులు చేయించలేదని, వాటిని రిపేర్లు చేయించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వంలో సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీస్ అనేది హేతబద్దంగా నియమించలేదన్నారు. పోలీస్ అంటే సరైన ఫిట్ నెస్, రిటన్ టెస్ట్, ట్రైనింగ్ అవసరం అని చెప్పారు. గంజా నిర్మూలన కోసం నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. దీనిని ప్రజలు సహకరించాలని, పోలీసులకు సహాయసహకారాలు అందజేయాలన్నారు. అప్పుడే పూర్తిస్థాయిలో మూలాలను పెకలించవచ్చని తెలిపారు. అప్పటి వరకు తాము పండిస్తున్న, అక్రమ రావాణా చేస్తున్న, ఉపయోగిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే పోలీసు డిపార్ట్మెంట్ లో భర్తీలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఎక్కడా నియామకాలు చేపట్టలేదన్నారు. అలాగే ఇప్పటి వరకు మనకు పోలీస్ అకాడమీ లేదని తెలిపారు. గతంలో హైదరాబాద్ పోలీస్ అకాడమీని చూస్తే ఇతర రాష్ట్రాల వాళ్లకు ఒక రోల్ మోడల్ గా ఉండేదని తెలిపారు. అలాంటి అకాడమీ తాముకూడా నిర్మించుకోవాలని అనుకునే వారని తెలిపారు. కానీ ఈ ఐదేళ్ల కాలంలో అలాంటి ఆలోచనే గత ప్రభుత్వం చేయలేదని చెప్పారు. వీటన్నింటిపై త్వరలో ఒక సబ్ కమిటీవేసి తీసుకోవల్సిన చర్యలపై చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles