Accident in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీ కొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు .. 12 మందికి గాయాలు
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇచ్చాపురం టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డివైడర్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 12 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు..
Accident in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇచ్చాపురం టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డివైడర్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 12 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్ ట్రావెల్ బస్సు. విశాఖ పట్నం నుంచి భువనేశ్వర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Also Read: మరోసారి పెరిగిన చమురు ధరలు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ‘పెట్రో’ మంట.. హైదరాబాద్‌లో ఎంతంటే..?