AP Local Body Elections: సుప్రీం కోర్టు పంచాయతీ తీర్పు.. ఎన్నికల కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం సహకారం
AP Local Body Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీషెడ్యూల్ విడుదల చేశారు. ...
AP Local Body Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీషెడ్యూల్ విడుదల చేశారు. అయితే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కోర్టు తీర్పుకు అనుగుణంగా ముందుకు వెళ్తోంది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ ముఖ్యనేతలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించారు. ప్రభుత్వం తరపున నుంచి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఈ ఎన్నికల్లో ఎస్ఈకీ సహకరించాలని నేతలను, అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్లో జోక్యం కలుగజేసుకోమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా, ఫ్రంట్ లైన్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేస్తున్న నేపథ్యంలో కొన్ని రోజులు ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వం అభ్యర్థనను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. అయితే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను విడుదల చేసిన నోటిఫికేషన్ ను సవరిస్తూ మళ్లీ రీషెడ్యూలు చేశారు.