AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై సికింద్రాబాద్‌ కోర్టులో కౌంటర్‌ దాఖలు.. ఈ నెల 27న విచారించనున్న కోర్టు

Bowenpally Kidnap Case: సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్

జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై సికింద్రాబాద్‌ కోర్టులో కౌంటర్‌ దాఖలు.. ఈ నెల 27న విచారించనున్న కోర్టు
uppula Raju
|

Updated on: Jan 26, 2021 | 5:11 AM

Share

Bowenpally Kidnap Case: సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి‌కి హైదరాబాద్ పోలీసులు అనుకోని షాక్ ఇచ్చారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రాబాద్‌ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. పరారీలో ఉన్న విఖ్యాత్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్‌లో పేర్కొన్నారు.

భూ వివాదానికి సంబంధించి ముగ్గురు సోదరులను అపహరించిన కేసులో విఖ్యాత్‌ రెడ్డి బాధితులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారని పిటిషన్‌లో తెలిపారు. మరోవైపు ఈ కేసులో విఖ్యాత్‌ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తారని ఆయన తరఫు న్యాయవాది ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సికింద్రాబాద్‌ న్యాయస్థానం ఈనెల 27కు వాయిదా వేసింది.

Seven Players Padma Shri: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఏడుగురు క్రీడాకారులకు పద్మశ్రీ..