AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Botsa Satyanarayana: పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు శిరసావహిస్తాము: మంత్రి బోత్స సత్యనారాయణ

Minister Botsa Satyanarayana: పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును శిరసావహిస్తామని ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. గ్రామాల్లో ఏకగ్రీవాలు ఎప్పటి ...

Minister Botsa Satyanarayana: పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు శిరసావహిస్తాము: మంత్రి బోత్స సత్యనారాయణ
Botsa Satyanarayana
Subhash Goud
|

Updated on: Jan 26, 2021 | 5:28 AM

Share

Minister Botsa Satyanarayana: పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును శిరసావహిస్తామని ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. గ్రామాల్లో ఏకగ్రీవాలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయని అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం తమదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ఇబ్బంది రాకూడదనేదే తమ అభిప్రాయమని అన్నారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఎవరో వచ్చి తమ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. ఎన్నికల్లో విజయం తమదే ఖాయమన్నారు. కొందరు కావాలని ప్రభుత్వం పై బురద జల్లుతూ కుట్రలకు దిగుతున్నారని ఆరోపించారు. త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వ‌లేక లేనిపోని నింద‌లు వేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎన్ని కుట్ర‌లు చేసినా.. ప్ర‌జ‌లు త‌మ వైపే ఉన్నార‌న్నారు.

Also Read: AP Panchayat Elections: ఎల్లుండి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్