AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్ పైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల దాష్టీకం.. అవ్వా తాతలను గెంటేసి.. ఇంటికి తాళం!

అవసరం ఉన్నా, లేకున్నా రుణం ఇస్తామంటూ ప్రైవేట్ ఫైనాన్స్‌ కంపెనీ ఏజెంట్లు వెంటపడతారు. ఎలాంటి పత్రాలు లేకున్నా వెంటనే నిమిషాల్లో రుణం మంజూరు చేసేస్తారు. షూరిటీలు లేకున్నా పర్వాలేదంటారు. తీరా రుణం తీసుకున్న తరువాత ఒక నెల వాయిదా లేటయినా వెంటనే ఇంటి మీద పడిపోతారు. నలుగురిలో పరువు తీసేస్తారు. నానా దుర్భాషలాడుతూ దౌర్జన్యాలకు దిగుతారు.

ప్రైవేట్ పైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల దాష్టీకం.. అవ్వా తాతలను గెంటేసి.. ఇంటికి తాళం!
Financers Misbehaive
Fairoz Baig
| Edited By: |

Updated on: Jun 22, 2025 | 8:32 PM

Share

అవసరం ఉన్నా, లేకున్నా రుణం ఇస్తామంటూ ప్రైవేట్ ఫైనాన్స్‌ కంపెనీ ఏజెంట్లు వెంటపడతారు. ఎలాంటి పత్రాలు లేకున్నా వెంటనే నిమిషాల్లో రుణం మంజూరు చేసేస్తారు. షూరిటీలు లేకున్నా పర్వాలేదంటారు. తీరా రుణం తీసుకున్న తరువాత ఒక నెల వాయిదా లేటయినా వెంటనే ఇంటి మీద పడిపోతారు. నలుగురిలో పరువు తీసేస్తారు. నానా దుర్భాషలాడుతూ దౌర్జన్యాలకు దిగుతారు. ఇటీవల కాలంలో ప్రైవేటు ఫైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల బెదిరింపులకు తట్టుకోలేక కొంతమంది బాధితులు ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. సాధారణ బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలంటే సవాలక్ష సవాళ్ళు ఎదురవుతుండటంతో ఈజీగా డబ్బులు ఇచ్చే ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీల బారిన పడి రుణగ్రహీతలు ఇళ్ళు, ఒళ్ళు గుల్లచేసుకుంటున్నారు. ఇలాంటి ఉదంతమే తాజాగా ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలోని ఎస్‌టి కాలనీలో ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీ రికవరీ ఏజెంట్లు దౌర్జన్యానికి దిగారు. అప్పు కట్టలేదన్న సాకుతో ఇంట్లోని వారందర్నీ బయటకు పంపి ఇంటికి తాళం వేశారు. ఫైవ్ స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. బింగినపల్లి ఎస్‌టి కాలనీలో ఉంటున్న పొట్లూరి వెంకటరాజా కుటుంబ అవసరాల నిమిత్తం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి, 2.50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఫైనాన్స్ వాళ్లకు నెలనెలా డబ్బులు జమ చేస్తూ వచ్చాడు.

అయితే తీసుకున్న రూ. 2.50 లక్షల్లో 1.70 లక్షల రూపాయలు మాత్రమే కట్టారంటూ ఫైనాన్స్‌ కంపెనీ రికవరీ ఏజెంట్లు గత కొన్ని రోజులుగా వెంకటరాజా వెంటపడుతున్నారు. నెలనెలా వాయిదాల పద్ధతిలో డబ్బులు కట్టుకుంటూ వస్తున్న సమయంలో తలెత్తిన ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కొంత జాప్యం జరిగిందని, త్వరలోనే తీర్చేస్తానని వెంకటరాజా వేడుకున్నాడు. అయితే రికవరీ ఏజెంట్లు వెంకటరాజా మాటలను వినకుండా దౌర్జన్యానికి దిగారు. ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బయటకు పంపించి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయారు.

ఈ మధ్య ఆర్థిక ఇబ్బందుల వలన ఒక్క నెల డబ్బులు కట్టలేదని ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఇంటికి తాళం వేయడం అన్యాయమంటూ వెంకటరాజా తల్లిదండ్రులు పొట్లూరి వెంకటేశ్వర్లు, వెంకాయమ్మ వృద్ధ దంపతులు వాపోతున్నారు. ఇంటికి తాళం వేయడంతో దిక్కుతోచని స్థితిలో ఇంటి ముందు కూర్చుని రోదిస్తున్నారు. కుమారుడు హైదరాబాద్‌లో బేల్దారు పని చేసుకుంటూ.. డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. ఒక్క నెల డబ్బులు పంపించలేక పోయారేసరికి ఫైవ్‌స్టార్‌ కంపెనీ రికవరీ ఏజెంట్లు బలవంతంగా ఇంట్లో నుంచి బయటికి నెట్టేసి ఇబ్బందులకు గురి చేశారని గోడు వెళ్ళబోసుకున్నారు. ఇంటికి తాళం వేశారని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..