AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore Chepala Pulusu: నోరూరించే నెల్లూరు చేపల పులుసు.. ఇలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోండి

మనం ఎప్పుడు బయట ప్రాంతాలకు వెళ్లినా.. అక్కడ దొరికే స్పెషల్ తో పాటు మన స్టైల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో ముందుగా వెతుక్కుంటాం. అందులోనూ నెల్లూరు చేపల పులుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెల్లూరు తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలవారికి తెగ నచ్చే వెరైటీ చేపల పులుసు.. ఇక బయట రాష్ట్రాల వారికి కూడా ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు ఫెవరేట్ గా మారింది. అయితే ప్రతిసారి నెల్లూరు వెళ్లి చేపల పులుసు తినలేం.. అలా అని ఆ పేరుతో రెస్టారెంట్ లో అందుబాటులో ఉన్నా అన్ని సందర్భాల్లో కుదరదు. అందుకే మనమే ఇంట్లో నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఇలా తయారు చేసుకోవచ్చు.

Nellore Chepala Pulusu: నోరూరించే నెల్లూరు చేపల పులుసు.. ఇలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోండి
Nellore Chepala Pulusu
Ch Murali
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 10, 2023 | 10:55 PM

Share

మనం ఎప్పుడు బయట ప్రాంతాలకు వెళ్లినా.. అక్కడ దొరికే స్పెషల్ తో పాటు మన స్టైల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో ముందుగా వెతుక్కుంటాం. అందులోనూ నెల్లూరు చేపల పులుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెల్లూరు తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలవారికి తెగ నచ్చే వెరైటీ చేపల పులుసు.. ఇక బయట రాష్ట్రాల వారికి కూడా ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు ఫెవరేట్ గా మారింది. అయితే ప్రతిసారి నెల్లూరు వెళ్లి చేపల పులుసు తినలేం.. అలా అని ఆ పేరుతో రెస్టారెంట్ లో అందుబాటులో ఉన్నా అన్ని సందర్భాల్లో కుదరదు. అందుకే మనమే ఇంట్లో నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఇలా తయారు చేసుకోవచ్చు. నెల్లూరు లో రుచికరమైన చేపల పులుసు కోసం ఈ రకాల చేపలను వండడం జరుగుతుంది. అందులో మొదట ప్రాధాన్యత కొరమీను, తర్వాత బొమ్మిడాయిలు, గండి, కృష్ణ బొచ్చె, గడ్డి మోసు చేపలను ఎక్కువగా పులుసు కోసం ప్రిఫర్ చేస్తుంటారు..

ముందుగా నెల్లూరు చేపల పులుసు కు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..

కిలో చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు

ఇవి కూడా చదవండి

* చింత పండు 150 గ్రాములు *టమోటో మీడియం సైజ్ 3 *ఉల్లిపాయలు 2 * ఆవాలు పావు స్పూన్ * కరివేపాకు రెండు రెమ్మలు. * మెంతులు ఒక టీ స్పూన్ * ధనియాలు నాలుగు స్పూన్లు * పసుపు ఒక టీ స్పూన్ * కారం పొడి ఆరు స్పూన్లు. * జీలకర్ర పావు స్పూను * నీళ్లు నాలుగు కప్పులు. * ఉప్పు తగినంత. * నూనె 6 స్పూన్లు. * చిన్న సైజు మావిడి కాయ.

తయారీ విధానం

*పాన్ లో మొదటగా మెంతులు, ధనియాలు దోరగా వేయించుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకుని పక్కన ఉంచుకోవాలి..

*అర్ధ గంట ముందుగానే ముందుగానే చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి.. బాగా నానిటే చిక్కటి పులుసు కోసం మంచి గుజ్జు తయారవుతుంది.

* కట్ చేసుకున్న చేపల ముక్కలను శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడగాలి..

* పులుసు కలువుకునే విధానం..

నానిన చింతపండును నాలుగు కప్పుల నీళ్లలో బాగా మెత్తగా కలుపుకోవాలి.. కలిపిన తర్వాత రసాన్ని వడకట్టుకోవాలి.. ఆ చిక్కటి చింతపండు రసంలో ఆరు స్పూన్ల కరంపొడి, పసుపు , సరిపడా ఉప్పు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.

* తర్వాత పాన్ లో ఆరు స్పూన్లు ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి పోపు బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన అనియన్స్ వేసి ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమోటో ముక్కలు వేసి ఫ్రై చెయ్యాలి.. అందులోనే కాస్త పసుపు, ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది..

* ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు పులుసును పాన్ లో వేసి కొద్దిసేపు అగాక శుభ్రం చేసిన చేపల ముక్కలను వేయాలి.

* ముందుగా సిద్ధం చేసుకున్న మెంతులు, ధనియాల పొడిని పులులో వేయాలి..

* నెల్లూరు చేపల పులుసు అంతలా రుచికరంగా ఉండడానికి మావిడి కాయ కాంబినేషన్.. కొన్ని మావిడి ముక్కలను పులుసులో వేయాలి..

* 15 నిముషాల పాటు తక్కువ ఫ్లేమ్ పై ఉంచితే చేపల పులుసు సిద్ధమవుతోంది..

అంతే మీ ఫెవరేట్ నెల్లూరు చేపల పులుసు సిద్ధమయినట్లే