Andhra Pradesh: రాథ హత్య కేసులో కీలక అప్‌డేట్.. హంతకుడిని పట్టించిన గూగుల్ టేక్ అవుట్..
ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన వివాహిత రాధ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా హంతకుడిని పట్టేశారు పోలీసులు. వెలిగండ్ల మండలం జిల్లెల పాడులో జరిగిన రాధ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. భార్య రాధపై అనుమానంతో పక్కా ప్లాన్‌తో భర్త మోహన్ రెడ్డే హత్య చేసినట్లు అనుమానించారు..
ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన వివాహిత రాధ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా హంతకుడిని పట్టేశారు పోలీసులు. వెలిగండ్ల మండలం జిల్లెల పాడులో జరిగిన రాధ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. భార్య రాధపై అనుమానంతో పక్కా ప్లాన్‌తో భర్త మోహన్ రెడ్డే హత్య చేసినట్లు అనుమానించారు పోలీసులు. ఆ దిశగా విచారించగా.. అసలు కథ బయటకొచ్చింది. విచారణలో హత్య జరిగిన సమయంలో తాను కనిగిరిలో లేనని, హైదరాబాద్‌లో ఉన్నట్లు భర్త మోహన్ రెడ్డి అబద్ధం చెప్పినట్లు గుర్తించారు. గూగుల్ టేక్ అవుట్ ద్వారా మోహన్ రెడ్డి కనిగిరిలోనే ఉన్నట్టు గుర్తించారు.
దాని ఆధారంగా పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం బయటపడింది. పోలీసుల విచారణలో ఈ హత్య చేసింది తాను ఒక్కడినే అని మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. అయితే, మోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది ఉన్నారన్న అనుమానంతో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. రాధ భర్త మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.
వెలిగండ్ల మండలం జిల్లెల పాడులో రాధను హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. తొలుత రాధ స్నేహితుడు కాశిరెడ్డి ఆమెను హత్య చేశాడని పోలీసులు అనుమానించారు. అయితే, దర్యాప్తులో భర్త మోహన్ రెడ్డే ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించారు. దాంతో మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మలిక గార్గ్ వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..