Sita-Rama kalyanam: భద్రాద్రి రాములోరి కల్యాణం కోసం ప్రకాశం జిల్లా నుంచి గోటి తలంబ్రాలు
భద్రాచలంలో ఏటా శ్రీరామ నవమి నాడు శ్రీ సీతారామచంద్రస్వామికి నిర్వహించే కల్యాణోత్సవంలో గోటి తలంబ్రాలను ఉపయోగిస్తారు. ఈ సంప్రదాయం కొన్నేళ్ల నుంచి కొనసాగుతోంది.

భద్రాచలంలో ఏటా శ్రీరామ నవమి నాడు శ్రీ సీతారామచంద్రస్వామికి నిర్వహించే కల్యాణోత్సవంలో గోటి తలంబ్రాలను ఉపయోగిస్తారు. ఈ సంప్రదాయం కొన్నేళ్ల నుంచి కొనసాగుతోంది. జగత్ కళ్యాణంగా అభివర్ణించే కల్యాణంలో వినియెగించే గోటి తలంబ్రాలు సిద్ధం చేసే అరుదైన అవకాశం ప్రకాశం జిల్లా చీరాల వాసులకి దక్కింది. లోక కళ్యాణంగా భావించే భద్రాద్రి సీతారాములవారి కల్యాణానికి ఎంతటి ఖ్యాతి ఉందో ….ఆ కల్యాణంలో వినియెగించే గోటి తలంబ్రాలకు సైతం అంతే ప్రత్యేకత వుంది. ఆ కల్యాణ వేడుకలలో తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమాని భావిస్తారు భక్తులు. అటువంటిది సాక్ష్యాత్తూ ఆ జానకిరాముని కల్యాణానికి వినియెగించే కోటి గోటి తాలంబ్రాలను తయారు చేస్తే ఆ అనుభూతే వేరు కదా. అటువంటి మహత్కర కార్యానికి శ్రీకారం చూట్టారు ప్రకాశం జిల్లా, చీరాల వాసులు.
భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాములవారి కల్యాణానికి గత ఏడూ సంవత్సరాలుగా కోటి గోటి తలంబ్రాలు ఒలిచి కల్యాణ వేడుకులకు తరలిస్తూ స్వామివారి సేవలో పునీతులవుతున్నారు ఇక్కడి శ్రీ రఘురామా భక్త సేవ సమితి సభ్యులు. విజయ దశమి నాటి మొదలుకొన్ని భక్తిశ్రద్ధలతో పట్టణ వాసులను భాగస్వాములను చేస్తూ… రామనామ జపం చేస్తూ సుమారు ఆ నెలల పాటు 15 వేల కిలోల తలంబ్రాలను గోటి తో ఒలిచి రాములోరి కల్యాణ వేడుకులకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది.
ప్రస్తుతం ఈ కోటి గోటి తలంబ్రాలను ఎంతో భక్తిశ్రద్దలతో నియమ నిష్ఠలతో ఒలిచి చీరాల వాసులు సీతారాములోరి సేవలో పరవశిస్తున్నారు. ఇంతటి మహత్కార్యంలో తమను భాగస్వాములు చేయడం ఆనందంగా ఉందంటున్నారు భక్తులు.
Also Read:Black Magic: ఎండు చేపలు, అన్నం ముద్దలతో క్షుద్రపూజలు.. ఆ పేపర్లలో ఏం గీశారంటే..?
గసగసాల ముసుగులో నిషేధిత మాదక ద్రవ్యాలు.. మామిడి తోటలో విచ్చలవిడిగా డ్రగ్స్.. పూర్తి వివరాలు ఇవిగో
