Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నగిరిలో పవర్‌ లూమ్ కార్మికుల ఆందోళన.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Andhra Pradesh: పవర్‌ లూమ్‌ కార్మికుల ధర్నాతో దద్దరిల్లిపోయింది నగరి టౌన్. వేలాది మంది రోడ్డెక్కడంతో చెన్నై-తిరుపతి హైవేపై రాకపోకలు స్తంభించిపోయాయ్.

Andhra Pradesh: నగిరిలో పవర్‌ లూమ్ కార్మికుల ఆందోళన.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..
Protest
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 14, 2022 | 8:11 AM

Andhra Pradesh: పవర్‌ లూమ్‌ కార్మికుల ధర్నాతో దద్దరిల్లిపోయింది నగరి టౌన్. వేలాది మంది రోడ్డెక్కడంతో చెన్నై-తిరుపతి హైవేపై రాకపోకలు స్తంభించిపోయాయ్. మంత్రి ఆర్కే రోజా సొంత నియోజకవర్గం నగిరిలో పవర్‌ లూమ్ కార్మికులు రోడ్డెక్కారు. కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ నగరి హైవేను ముట్టడించారు. వేలాది మంది కార్మికులు రోడ్డుపైకి రావడంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. చెన్నై-తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

పవర్‌ లూమ్స్ కార్మికుల ధర్నాతో దద్దరిల్లిపోయింది నగిరి పట్టణం. ఒకవైపు హైవేను, మరోవైపు ఎమ్మార్వో ఆఫీస్‌ను ముట్టడించి నిరసన తెలిపారు కార్మికులు. తాము ఒక మెట్టు దిగినా, యాజమాన్యం మాత్రం తమ డిమాండ్‌ను పట్టించుకోడం లేదంటున్నారు కార్మిక నేతలు. పదేళ్లుగా కూలీ రేట్లు పెంచలేదని, తామెలా బతకాలని వాపోతున్నారు కార్మికులు. నిత్యవసర వస్తువుల ధరలన్నీ పెరిగినా, తమకు మాత్రం పదేళ్లనాటి రేట్లే ఇస్తే తమ పిల్లల్ని ఎలా తిండిపెట్టగలమని ప్రశ్నిస్తున్నారు. కాగా, పవర్‌ లూమ్‌ కార్మికుల ఆందోళనపై జిల్లా కలెక్టర్‌ స్పందించారు. కలెక్టర్‌ ఆదేశాలతో మాస్టర్ వీవర్స్‌, కార్మికులతో చర్చలు జరిపారు ఆర్డీవో అండ్ లేబర్‌ కమిషనర్‌. ఇరువర్గాలు ఒక నిర్ణయానికి రావడంతో ఆందోళన విరమించారు పవర్ లూమ్‌ కార్మికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అయ్యో పాపం..పెంపుడు కుక్క కోసం మొసలితో ఫైట్‌ చేసిన యువతి.. చివరకు
అయ్యో పాపం..పెంపుడు కుక్క కోసం మొసలితో ఫైట్‌ చేసిన యువతి.. చివరకు
వరుడి షూ దాచి డబ్బు డిమాండ్‌! 5 వేలే ఇచ్చాడని..
వరుడి షూ దాచి డబ్బు డిమాండ్‌! 5 వేలే ఇచ్చాడని..
ప్రభాస్ బౌలింగ్‏కు రామ్ చరణ్ బ్యాటింగ్.. ఎన్టీఆర్ క్యాచ్..
ప్రభాస్ బౌలింగ్‏కు రామ్ చరణ్ బ్యాటింగ్.. ఎన్టీఆర్ క్యాచ్..
బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసిండు.. చివరకు..
బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసిండు.. చివరకు..
దర్శకులు అనాలా.. యాక్టర్స్ అనాలా.. యంగ్ కెప్టెన్స్ సూపర్ టాలెంట్‌
దర్శకులు అనాలా.. యాక్టర్స్ అనాలా.. యంగ్ కెప్టెన్స్ సూపర్ టాలెంట్‌
భాయ్ హ్యాండిల్ విత్ కేర్! పోలార్డ్ కి MI ఫ్యాన్ స్వీట్ వార్నింగ్
భాయ్ హ్యాండిల్ విత్ కేర్! పోలార్డ్ కి MI ఫ్యాన్ స్వీట్ వార్నింగ్
ప్రతిరోజూ 10 నిమిషాలు సైకిల్ తొక్కితే చాలు..ఎన్ని లాభాలో తెలిస్తే
ప్రతిరోజూ 10 నిమిషాలు సైకిల్ తొక్కితే చాలు..ఎన్ని లాభాలో తెలిస్తే
ఈ చెట్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్.. కాసులు కురిపించే వ్యాపారం
ఈ చెట్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్.. కాసులు కురిపించే వ్యాపారం
దేశంలోనే అతిపెద్ద ఫ్రూట్‌ మార్కెట్‌! మన హైదరాబాద్‌లో ఎక్కడంటే..?
దేశంలోనే అతిపెద్ద ఫ్రూట్‌ మార్కెట్‌! మన హైదరాబాద్‌లో ఎక్కడంటే..?
పెరిగిన భారతదేశ ఫారెక్స్ నిల్వలు.. ఐదు నెలల్లో అతిపెద్ద పెరుగుదల
పెరిగిన భారతదేశ ఫారెక్స్ నిల్వలు.. ఐదు నెలల్లో అతిపెద్ద పెరుగుదల