AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Mela: ఆంధ్రప్రదేశ్‌లో భారీ జాబ్‌ మేళా.. 1000 పోస్టుల భర్తీ.. ఇంటర్వ్యూలు ఎక్కడంటే..

Job Mela: ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తరుచూ జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు చోట్ల జాబ్‌ మేళాలను...

Job Mela: ఆంధ్రప్రదేశ్‌లో భారీ జాబ్‌ మేళా.. 1000 పోస్టుల భర్తీ.. ఇంటర్వ్యూలు ఎక్కడంటే..
Narender Vaitla
|

Updated on: Jul 14, 2022 | 9:11 AM

Share

Job Mela: ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తరుచూ జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు చోట్ల జాబ్‌ మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో జాబ్‌ మేళాను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జూలై 18న విశాఖపట్నంలో జరగనున్న జాబ్‌మేళాకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* జాబ్‌మేళాలో భాగంగా యోకోహమా (YOKOHAMA) సంస్థలో మొత్తం 1000 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో IAT (ఇండస్ట్రియల్ అప్రంటీస్ ట్రైనీ) విభాగంలో 500 ఖాళీలు, WAT (ఉమెన్‌ అప్రంటీస్‌ ట్రైనీ) 500 ఖాళీలు ఉన్నాయి.

* ఐఏటీ పోస్టులకు ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్, డీజిల్ మెకానిక్) చేసిన అభ్యర్థులు అర్హులు.

* ఉమెన్ అప్రంటీస్ ట్రైనీ పోస్టులకు మూడేళ్ల డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఈ లింక్‌ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

* రిజిసర్ట్‌ చేసుకున్న అభ్యర్థులు ఈ ఈనెల 18న ఉదయం 10 గంటలకు జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు అచ్యుతాపురం, వైజాగ్ చిరునామాలో పని చేయాల్సి ఉంటుంది.

* జాబ్‌మేళాకు హాజరయ్యే సమయంలో రెజ్యూమ్‌, స్టడీ సర్టిఫికేట్స్‌ జిరాక్స్‌లు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను ఏపీఎస్‌ఎస్‌డీసీ డిస్ట్రిక్ట్‌ ఆఫీస్‌, కంచెర్ల పాలెం, విశాఖపట్నం 530007 అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం 7989158111 నంబర్‌ను సంప్రదించాలి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..