AP Politics: మాటల కత్తులు దూస్తున్న పల్నాటి పుంజులు.. ఉత్కంఠ రేపి ఉసూరుమనిపించిన నేతలు.. మళ్లీ అవే భీష్మ ప్రతిజ్ఞలు..

పల్నాడు పొలిటికల్‌ పుంజుల రాజకీయం రంజుగా మారింది. అభివృద్ధిపై నేతల మధ్య చర్చ అంటూ ఊరంతా డప్పేశారు. ఇంతకీ పొలిటికల్‌ పందెం కోళ్లు ఏం చర్చిస్తాయో అనే ఉత్కంఠతో ఊరంతా ఉత్సాహంగా కదిలొచ్చింది. కళ్లు కాయలు కాచేలా వేచి చూశాక తూచ్‌ అన్నారు. ఇంతకీ చర్చ ఎందుకు పోస్ట్‌పోన్‌ అయింది?

AP Politics: మాటల కత్తులు దూస్తున్న పల్నాటి పుంజులు.. ఉత్కంఠ రేపి ఉసూరుమనిపించిన నేతలు.. మళ్లీ అవే భీష్మ ప్రతిజ్ఞలు..
Kasu Mahesh Reddy and Yarapathineni Srinivasa Rao
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 16, 2022 | 7:38 PM

అవి పందెం కోళ్లయితే ఇవి పల్నాటి పొలిటికల్‌ పుంజులు. ఎనీ టైమ్‌ ఎనీ ప్లేస్‌ చర్చకు రాజకీయ రచ్చకు రెఢీ అన్నాయి. డే అండ్‌ నైట్‌ రెడీ టు ఫైట్‌ అన్నాయి పందెం కోళ్లు. వరి ఇంటికి వద్దులే ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో చూసుకుందాం అంటే చూసుకుందాం అనుకున్నారు. ఓన్లీ అభివృద్ధిపై మాత్రమే చర్చ అంటూ కొసమెరుపు జోడించారు. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం టర్న్‌ తీసుకుని అభివృద్ధిపై చర్చకు దారితీసింది. రండి బాబూ రండి ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ సాక్షిగా గురజాల అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ అంటూ ఊరంతా డప్పేశారు. ఇదేదే బాగుందే అనుకున్నారు జనం. ఓన్లీ టాక్స్‌ అంటే ఇళ్లంతా లాక్స్‌ వేసుకుని ఊరంతా పిడుగురాళ్ల ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌కి చేరుకుంది. నేతల చర్చ కోసం అందరు వేచి వేచి చూస్తుంటే చివరకు తూచ్‌ అన్నారు. పొలిటికల్‌ దివాలి ధమాకా 10 థౌజండ్‌ వాలా పేలుతుందనుకుంటే ఇష్యూ కాస్తా తుస్సుమంది. దీంతో జనం నిట్టూర్చురాట. పౌరుషాల గడ్డ పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ సీటులో ఎప్పుడూ హాటు రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. గత ఎన్నికల్లో టీడీపీ సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావుపై వైసీపీ నేత కాసు మహేష్‌ రెడ్డి విజయం సాధించారు. అప్పట్నించి కాసు, యరపతినేని మధ్య డైలీ సీరియల్‌లా డైలాగ్‌ వార్‌ ఏదో ఒక రూపంలో నడుస్తూనే ఉంది.

పొలటికల్‌ టర్న్‌ తీసుకున్న ఆక్రమణల తొలగింపు

ఇటీవల మాచవరం మండలం తురకపాలెంలో వైసీపీ సర్పంచ్ ఆక్రమణలు తొలగించడం మొదలు పెట్టారు. అయితే టీడీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లనే టార్గెట్ చేసుకున్నారని ఆరోపిస్తూ ఆక్రమణల తొలగింపును టీడీపీ అభిమానులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తనపై దాడి చేశారని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎనిమిది మంది టిడిపి సానుభూతిపరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

కాసు, యరపతినేని మధ్య డైలాగ్‌ వార్‌

ఈ సంఘటనపై యరపతినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాసుతో పాటు మాచవరం ఎస్‌ఐపై మండిపడ్డారు. కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మేము అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తామన్నారు. యరపతినేని వాఖ్యలను ఎమ్మెల్యే కొట్టేశారు. అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలను టచ్ చేస్తే తాట తీస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో యరపతినేని భగ్గుమన్నారు. వైసీపీ అరాచకాలకు అంతం పలుకుతామన్నారు. ఎమ్మెల్యే కౌంటర్ చేస్తూ యరపతినేని చేత రామకోటి రాయిస్తామన్నారు. రామకోటి రాస్తానో వైసీపీ నేతల చేత శ్రీను కోటి రాయిస్తానో త్వరలోనే తేలుతుందన్నారు యరపతినేని.

అభివృద్ధిపై చర్చిద్దామన్న కాసు.. మరో డేట్‌ చెప్పాలన్న యరపతినేని

మాటల యుద్ధం పీక్‌ స్టేజీకి చేరడంతో ఎమ్మెల్యే కాసు ఒక అడుగు ముందుకు వేసి గురజాల నియోజకవర్గం అభివృద్ధిపై ఆదివారం చర్చకు రావాలంటూ యరపతినేనిని ఆహ్వానించారు. పిడుగురాళ్ల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎవరి సమయంలో ఎంత అభివృద్ధి జరిగిందో తేలుద్దామన్నారు. అయితే కాసు ఆహ్వానాన్ని స్వాగతించిన యరపతినేని ఆదివారం రావడం తనకు కుదరదని మరొక డేట్ చెబితే చర్చకు వస్తామన్నారు.

మరోసారి చర్చకు రెడీ..

దీంతో ఆదివారం ఏం జరుగుతుందో నని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే కాసు మాత్రం అనుకున్న సమయానికే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు వచ్చారు. రాలేనని చెప్పిన యరపతినేని రాలేదు. తన నలభై నెలల కాలంలో చేసిన అభివృద్ధిని కాసు వివరించారు. అంతేకాదు యరపతినేని రిక్వెస్ట్ కు సానుకూలంగానే కాసు స్పందించారు. తప్పకుండా మరోసారి చర్చిద్దాం… ప్రతిపక్షం లెక్కలు తేలుద్దాం అన్నారు. దీనికి యరపతినేని సై అన్నారు. మరో రెండు డేట్లు చెప్పండి.. టీవీ9 వేదికగా నే చర్చిద్దాం అన్నారు. ఎంతో ఉత్సుకతను రేపిన వివాదం చివరికి ఇద్దరూ ఎదురుపడకపోయేసరికి తుస్సుమంది. రెండు పార్టీల అభిమానులు నీరు గారిపోయారు.

అయితే ఇద్దరూ చర్చకు సిద్ధంగానే ఉన్నామని చెప్పడంతో మరో రోజు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈసారైనా చర్చ జరిగి తమ నేత పై చేయి సాధించాలని ఇరు పార్టీల కార్యకర్తలు కోరుకుంటుంటే స్థానికులు మాత్రం ఏంటా ఈ గొడవ అనుకుంటున్నారు. టీవీ9 వేదికగా ఇద్దరూ మరోసారి చర్చకు వస్తారేమోనని గురజాల వాసులు ఎదురు చూస్తున్నారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..