Anantapur: అనంతపురంలో హీటెక్కుతున్న పాలిటిక్స్‌.. క్లాక్‌ టవర్‌ ఫ్లై ఓవర్‌ పేరుపై రచ్చ రచ్చ

అనంతపురంలోని క్లాక్ టవర్ దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్‌ పేరుపై రచ్చ జరుగుతోంది. దాదాపు 312 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. పట్టణ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు చిక్కంతా పేరుపైనే. ఆ ఫ్లై ఓవర్‌కు ఏం పేరు పెట్టాలా అనేదానిపై పెద్ద దుమారమే చెలరేగుతోంది.

Anantapur: అనంతపురంలో హీటెక్కుతున్న పాలిటిక్స్‌.. క్లాక్‌ టవర్‌ ఫ్లై ఓవర్‌ పేరుపై రచ్చ రచ్చ
Clock Tower Flyover
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2023 | 8:35 AM

అనంతపురంలోని క్లాక్ టవర్ దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్‌ పేరుపై రచ్చ జరుగుతోంది. దాదాపు 312 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. పట్టణ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు చిక్కంతా పేరుపైనే. ఆ ఫ్లై ఓవర్‌కు ఏం పేరు పెట్టాలా అనేదానిపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిధులతో ఫ్లైఓవర్ నిర్మించారు కాబట్టి క్లాక్ టవర్ ఫ్లైఓవర్‌కు శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించారు కాబట్టి ఆయన పేరు పెట్టడమే కరెక్ట్‌ అంటున్నారు బీజేపీ నాయకులు. ఇక ఇటు క్లాక్ టవర్ ఫ్లైఓవర్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు పేరును పెట్టడం సరైనది అంటున్నారు టీడీపీ లీడర్లు.

ఇక సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌కు తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టాలని ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మరి కొంతమంది కొత్త ఫ్లైఓవర్‌కు నీలం సంజీవరెడ్డి పేరు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా క్లాక్ టవర్ ఫ్లైఓవర్ పేరుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏం పేరు పెట్టాలని తర్జనభర్జన పడుతున్నారు. ఎవరికి వారు పేర్లు సూచిస్తుండడంతో ఫ్లైఓవర్ పేరుపై పెను వివాదమే చెలరేగుతుంది. ఇక అనంతపురం పట్టణ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఫ్లైఓవర్ కి ఏం పేరు పెట్టాలనే దానిపై ఒక క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ సీఎం జగన్‌కి మాత్రం ఓ పేరు సూచించినట్లు తెలుస్తోంది. మరి సీఎం జగన్ మనసులో ఏముందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..