Vizag: గ్రాసరీ బిజినెస్‌ అంటూ ఇంటిని రెంట్‌కు తీసుకున్నారు.. గుట్టు చప్పుడు కాకుండా ఆ పనులు.. చివరకు..

మధురవాడలో ఓ ఇంటిని గ్రాసరీ బిజినెస్ కోసమంటూ అద్దెకు తీసుకుని.. మరి కొంతమందిని పెట్టి.. గుట్టు చప్పుడుకాకుండా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ఈ ముఠాను ట్రాక్ చేశారు.

Vizag: గ్రాసరీ బిజినెస్‌ అంటూ ఇంటిని రెంట్‌కు తీసుకున్నారు.. గుట్టు చప్పుడు కాకుండా ఆ పనులు.. చివరకు..
Visakhapatnam Police
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2023 | 6:33 AM

గుట్టు చప్పుడుకాకుండా ఆన్‌లైన్‌ బెట్టింగ్ దందా నడిపిస్తున్న ముఠాను.. విశాఖ పోలీసులు పట్టుకున్నారు. 19 మందిని అరెస్టు చేసి.. సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా విదేశీ వెబ్సైట్స్‌ ద్వారా.. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. 71 బ్యాంకు ఎకౌంట్లను ఆన్లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. ఆయా ఖాతాల్లోని ఐదు కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయాలని.. ఇప్పటికే బ్యాంకులకు లేఖలు రాశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు కూడా సమాచారం అందించారు. విదేశాల నుంచి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తూ.. దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో వీరు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బెట్టింగ్ పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలతో అమాయకులకు గాలం వేస్తున్నారనీ చెప్పారు. మధురవాడలో ఓ ఇంటిని గ్రాసరీ బిజినెస్ కోసమంటూ అద్దెకు తీసుకుని.. మరి కొంతమందిని పెట్టి.. గుట్టు చప్పుడుకాకుండా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ఈ ముఠాను ట్రాక్ చేశారు. వాళ్లను పట్టుకుని విచారించేసరికి… మహదేవ్ బుక్ పేరుతో యాప్ నిర్వహిస్తూ ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు పాల్పడుతున్నారనే విషయం బయటపడింది.

19మంది నుంచి మొత్తం 53 మొబైల్స్, 7 లాప్టాప్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు… 14 బ్యాంకుల్లోని 71అకౌంట్ల ద్వారా ఈ దందా నడుపుతున్నట్టు గుర్తించారు. మహదేవ్ యాప్ నిర్వహణపై ఘజియాబాద్, గురుగావ్, రాయపూర్‌లలో కేసులున్నట్టు తేల్చారు. కేసు తీవ్రత దృష్ట్యా.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు కూడా సమాచారం అందించారు పోలీసులు. అయితే, మోసపోయినట్టు విశాఖలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదనీ.. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పోలీసులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..