Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో బాబు-పవన్‌ భేటీ ప్రకంపనలు.. జనసేనాని ఏం చేయబోతున్నారు?

బాబు-పవన్‌ మీటింగ్‌ ఏపీ పాలిటిక్స్‌లో ప్రకంపనలు రేపుతోంది. జనసేనాని ఉన్నట్టుండి చంద్రబాబు ఇంటికెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఇంత సడన్‌గా బాబుతో పవన్‌ ఎందుకు భేటీ అయ్యారు!. పొత్తులు, సీట్ల సర్దుబాటు కోసమేనా!. అసలు, చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ ఏం చర్చించారు!. ఇదే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ది ఏపీగా మారింది.

Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Apr 30, 2023 | 3:21 PM

బాబు-పవన్‌ మీటింగ్‌ ఏపీ పాలిటిక్స్‌లో ప్రకంపనలు రేపుతోంది. జనసేనాని ఉన్నట్టుండి చంద్రబాబు ఇంటికెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఇంత సడన్‌గా బాబుతో పవన్‌ ఎందుకు భేటీ అయ్యారు!. పొత్తులు, సీట్ల సర్దుబాటు కోసమేనా!. అసలు, చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ ఏం చర్చించారు!. ఇదే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ది ఏపీగా మారింది.

2019లో బ్రేకప్‌ చెప్పుకున్నాక, గతేడాది అక్టోబర్‌ 18న బాబు-పవన్‌ మధ్య ఫస్ట్‌ మీటింగ్‌ జరిగింది. అప్పటికే బాబు, పవన్‌ కలుస్తారన్న ప్రచారంతో ఆ భేటీకి భారీ హైప్‌ వచ్చింది. మళ్లీ ఈ ఏడాది స్టార్టింగ్‌లో జనవరి 8న ఇంటికెళ్లిమరీ చంద్రబాబుతో సమావేశమయ్యారు పవన్‌. ఇప్పుడు మరోసారి జనసేనాని… చంద్రబాబు ఇంటికెళ్లి భేటీకావడం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్‌ రేగింది.

వైసీపీ వ్యతిరేక ఓటును చీలనియ్యను, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే తన లక్ష్యం, 2024లో జగన్‌ను గద్దె దించి తీరుతాం అన్నది పవన్‌ చెబుతోన్న మాట. ఈనెల 4న ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశం తర్వాత కూడా ఇదే మాట చెప్పారు జనసేనాని. అందుకు, 2014 కాంబినేషన్‌ రిపీట్‌ కావాలనేది పవన్‌ ఆలోచన. పొత్తులపై ఆరోజు జనసేనాని ఏమన్నారు. ఇప్పుడు బాబుతో పవన్‌ భేటీపై వైసీపీ రియాక్షన్‌ ఒకసారి చూద్దాం.

ఇవి కూడా చదవండి

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌. వీళ్లిద్దరూ ఎప్పుడు కలిసినా సంచలనమే. ఏపీ పాలిటిక్స్‌లో ఈ కాంబినేషన్‌కున్న క్రేజ్‌ అలాంటిది. బాబు-పవన్‌ కలిస్తేచాలు ప్రత్యర్ధుల గుండెల్లో ప్రకంపనలు రేగుతాయ్‌. దానికి కారణం, 2014లో సక్సెస్సైన విన్నింగ్‌ కాంబినేషన్‌. టీడీపీ ప్లస్‌ బీజేపీ విత్‌ జనసేన. ఈ కాంబినేషన్‌తోనే 2014లో సూపర్‌ విక్టరీ కొట్టారు చంద్రబాబు. అప్పటివరకు వైసీపీనే అధికారంలోకి వస్తుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ పవర్‌లోకి వచ్చింది తెలుగుదేశం. బీజేపీతోపాటు జనసేన జత కలవడంతో టీడీపీ అనూహ్య విజయం సాధించింది. మరి, 2024లో ఈ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుందా?. అందుకు బీజేపీని పవన్‌ ఒప్పించగలుగుతారా? లేదా?. ఇప్పుడిది మరింత ఆసక్తికరంగా మారింది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..