AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఐటీ అధికారులమని నమ్మించి.. తుపాకీ గురి పెట్టి.. సర్వం దోచుకెళ్లారు.. కట్ చేస్తే..

అదొక పేదలుండే కాలనీ... ఆ కాలనీలో అందమైన భవనం... భవనం చుట్టూ ఎమినిది సీసీ కెమెరాలు. భవనంలోకి వచ్చి పోతుండే రిచ్ పర్సన్స్.. దీంతో చుట్టు పక్కల కలకలం.. వస్తున్న వాళ్ళు ఎవరూ... ఆ ఇంటిలో ఏం..

Andhra Pradesh: ఐటీ అధికారులమని నమ్మించి.. తుపాకీ గురి పెట్టి.. సర్వం దోచుకెళ్లారు.. కట్ చేస్తే..
Arrest
Ganesh Mudavath
|

Updated on: Feb 26, 2023 | 1:54 PM

Share

అదొక పేదలుండే కాలనీ… ఆ కాలనీలో అందమైన భవనం… భవనం చుట్టూ ఎమినిది సీసీ కెమెరాలు. భవనంలోకి వచ్చి పోతుండే రిచ్ పర్సన్స్.. దీంతో చుట్టు పక్కల కలకలం.. వస్తున్న వాళ్ళు ఎవరూ… ఆ ఇంటిలో ఏం జరుగుతుందన్న చర్చ… చివరికి వారు ఊహించిందే కరెక్ట్.. కట్టల కొద్దీ డబ్బులు.. సవర్ల కొద్దీ బంగారు ఆభరణాలు. ఇంకేముంది పక్కాగా ప్లాన్ వేశారు. అనుకున్నదంతా కొట్టేశారు. కాని పోలీసులకు చిక్కారు. ఇది నకిలీ ఐటి అధికారులు చోరి భాగోతం.. వివరాల్లోకి వెళితే గుంటూరులోని ప్రగతి నగర్.. ఐదో లైన్ లో సింగంశెట్టి కల్యాణి నివాసముంటోంది. ఈమెకు పరిచయస్తులైన ప్రసాద్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి ఆస్తి వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రసాద్ తన డబ్బులును కల్యాణి వద్ద దాచి పెడుతుంటాడు. ఒకటి బంధువులకు తెలియకూడదన్న జాగ్రత్త.. రెండోది ప్రభుత్వ అధికారుల నుండి అక్రమ సంపాదననను కాపడుకోవడం లక్ష్యంగా ప్రసాద్ దాచి పెడుతున్నాడు. అయితే ప్రసాద్ వచ్చి పోతుండటాన్ని గమనించిన స్థానికులు ఇంటిలో పెద్ద ఎత్తున నగదు, నగలున్నట్లు భావించారు. కల్యాణి ఇంటికి వచ్చి పోయే జాన్ బాబు, యేసు బాబులు కల్యాణి ఇంటిలో పెద్ద ఎత్తున నగదు, నగలున్నట్లు తెలుసుకున్నారు.

ఈ మధ్య కాలంలో ప్రసాద్ పొలం అమ్మగా వచ్చిన డబ్బుల్లో యాభై లక్షల రూపాయలను కల్యాణి ఇంటిలో దాచి పెట్టాడు. ఈ విషయం జాన్ బాబు, యేసు బాబుకు తెలిసింది. ఆ డబ్బులతో పాటు నగలు కొట్టేయాలని బాబులిద్దరూ డిసైడ్ అయ్యారు. ఇంకేంముంది బాబులకు స్నేహితులైన సురేష్, రవీంద్ర, వెంకట స్వామి, విజయ్ కుమార్ లకు విషయాన్ని చెప్పారు. అందరూ కలిసి ప్లాన్ వేశారు. ఐటీ అధికారుల రూపం ఎత్తితే పని సులువుగా చేయోచ్చని భావించారు. దీంతో సురేష్ కారు అద్దెకు తీసుకున్నాడు. నంబర్ ప్లేట్ తీసివేసి పోలీస్ స్టిక్కర్ అంటించాడు.

అతని స్నేహితులైన రవీంద్రబాబు, వెంకటస్వామిలను కారులో ఎక్కించుకున్నాడు. వీరికి ముందు ఆటోలో జాన్ బాబు, యేసు బాబు, విజయ్ కుమార్ లు వెళుతూ కల్యాణి ఇల్లు చూపించారు. ఆటోలో ప్రయాణించిన ముగ్గురు ఇంటి బయట కాపలా ఉండగా కారులో వచ్చిన ముగ్గురు ఐటీ అధికారులమంటూ ఇంటిలోకి వెళ్లారు. కల్యాణిని బెదిరించి డబ్బులు, నగలు తీసుకున్నారు. ఆమె వేలి ముద్రల కూడా సేకరించారు. ఐడీ కార్డులు చూపించారు. చివర్లో తుపాకి ఎక్కు పెట్టి కల్యాణిని బెదిరించారు కూడా. ఇంటిలో ఉన్న నగదు, నగలు తీసుకొని ఇంటి బయటకు వచ్చి కారులో వెళ్లి పోయారు.

ఇవి కూడా చదవండి

జాన్ బాబు, యేసు బాబు ఆ తర్వాత ఇంటిలోకి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకొని కల్యాణిని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్ వెళ్లారు. నకిలీ ఐటి అధికారుల పేరుతో దోపిడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పాత గుంటూరు పోలీసులు సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా కేసును చేధించారు. ఐదుగురిని అరెస్ట్ చేసి 48,50,000 రూపాయలను, 1326 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తుపాకితో బెదిరించిన వెంకట స్వామి మాత్రం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకున్న తర్వాత తుపాకి నిజమైనదా కాదా అన్న వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ ఆరీఫ్ హాఫీజ్ చెప్పారు. రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకన్న పోలీసులను ఎస్పీ అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..