AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం.. పోలీసులకు సవాల్ గా మారిన ఇన్సిడెంట్..

అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలం మద్ది నాయనిపల్లి అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం కలకలం రేపింది. హత్య చేసి పూడ్చి పెట్టిన మహిళ మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. చనిపోయిన మహిళ ఉప్పరోళ్లపల్లికి..

Andhra Pradesh: అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం.. పోలీసులకు సవాల్ గా మారిన ఇన్సిడెంట్..
Crime
Ganesh Mudavath
|

Updated on: Nov 02, 2022 | 8:43 PM

Share

అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలం మద్ది నాయనిపల్లి అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం కలకలం రేపింది. హత్య చేసి పూడ్చి పెట్టిన మహిళ మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. చనిపోయిన మహిళ ఉప్పరోళ్లపల్లికి చెందిన హేమవతిగా గుర్తించారు. ఆమె వయసు 45 ఏళ్లు ఉంటుందని నిర్ధరించారు. కాగా.. హేమవతి అన్నమయ్య జిల్లాలోని తన స్వగ్రామం నుంచి కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లా తాటకంవారిహాళ్లి లో నివాసముంటోంది. ఆమె బీ.కొత్తకోటలో నివాసం ఉన్న కూతురు భవాని ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె హత్యకు గురైంది. హేమావతిని హత్య చేసి మొలకల చెరువు మండలంలోని అటవీ ప్రాంతంలో శవాన్ని పూడ్చి పెట్టినట్లు గుర్తించిన పోలీసులు.. ఆర్థిక సంబంధాల కారణంగానే హత్య జరిగనట్లు అనుమానిస్తున్నారు. కాగా.. కుమార్తె ఇంటికి వెళ్లిన హేమలత బయటకు వెళ్లింది. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. నాలుగు రోజులు ఎదురు చూసిన తర్వాత ఇంటి నుంచి తిరిగి ఊరికి వెళ్ళిన హేమవతి కనిపించడం లేదంటూ ఆమె కూతురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. హేమలత.. బీ కొత్తకోటలో నివాసముంటున్న తన కూతురి ఇంటికి తరచూ వస్తుండేది. ఈ క్రమంలో ఆమెకు శ్రీకాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరుగుతుండటంతో స్నేహం పెరిగింది. వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో హేమలత చనిపోవడంతో ఆమె హత్యకు శ్రీకాంత్ కారణమన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శ్రీకాంత్ ఇచ్చిన సమాచారంతో హేమవతి డెడ్ బాడీ ని పూడ్చి పెట్టిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు.

కాగా.. శ్రీకాంత్ వద్ద తన తల్లి చాలా కాలంగా డబ్బు దాచుకుందని మృతురాలి కుమారుడు చెప్పాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకే తన తల్లిని శ్రీకాంత్ హత్య చేశాడని ఆరోపించాడు. డబ్బులు తిరిగిస్తానని చెప్పి ఫోన్ చేసి పిలిపించిన శ్రీకాంత్ హత్య చేశారని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. హేమవతి మిస్సింగ్ పై కర్ణాటకలోనూ ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..