Andhra Pradesh: బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కేసు నమోదు.. కారణమదేనట..!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోనసీమ జిల్లా కొత్తపేట
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఇవాళ సోము వీర్రాజు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎస్ఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కోనసీమ జిల్లాలో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు. అయితే, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఈ ప్రాంతంలోకి ముఖ్యమైన నాయకులు, భారీ స్థాయిలో కార్యకర్తలకు అనుమతి లేదు. జొన్నాడ వద్ద ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ తన సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహిస్తుండగా.. సోము వీర్రాజు తమ పార్టీ కార్యాకర్తలతో కలిసి వాహనాల్లో వచ్చారు. దాంతో పోలీసులు వారి వాహనాలను నిలిపివేశారు. ఆ సమయంలో సోము వీర్రాజు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎస్ఐని నెట్టివేశారు. దాంతో పోలీసులు ఆయనపై యాక్షన్ తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐని నెట్టడంతో సోము వీర్రాజుపై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసును మండపేట రూరల్ సీఐ శివ గణేష్ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.