AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: జోష్ నింపేందుకు టీడీపీ నయా ప్లాన్.. జిల్లాల పర్యటనకు చంద్రబాబు షెడ్యూల్ ఖరారు..

ప్రజల్లోకి వెళ్లి.. పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మరోసారి జిల్లాల పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

Chandrababu Naidu: జోష్ నింపేందుకు టీడీపీ నయా ప్లాన్.. జిల్లాల పర్యటనకు చంద్రబాబు షెడ్యూల్ ఖరారు..
Chandrababu Naidu
Shaik Madar Saheb
|

Updated on: Jun 09, 2022 | 8:31 AM

Share

Chandrababu Tour: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఓ వైపు అధికార వైఎస్ఆర్‌సీపీ గడగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో దూసుకుపోతుండగా.. టీడీపీ కూడా ఇదే తరహాలో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించింది. ఏపీలో మాటల యుద్ధం, పొత్తుల ఎత్తులు జోరుగా నడుస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లోకి వెళ్లి.. పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మరోసారి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.

ఈ నెల 15నుంచి చంద్రబాబు మలివిడిత జిల్లా పర్యటనలు మొదలుకానున్నాయి. ఈ మేరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి నెలకు రెండు జిల్లాల్లో బాబు టూర్లు నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో మూడు రోజులపాటు పర్యటన ఉండనుంది. ఈ నెల 15,16,17 తేదీల్లో అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. మొదటి రోజు మినీ మహానాడు బహిరంగ సభ, రెండో రోజు పార్టీ నేతలతో సమావేశాలు, మూడో రోజు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇలా ఏడాదిపాటు అన్ని జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

అనకాపల్లి పర్యటన షెడ్యూల్ వివరాలు..

ఇవి కూడా చదవండి

15న చోడవరంలో నిర్వహించే జిల్లా మహానాడులో చంద్రబాబు పాల్గొంటారు. జిల్లా మహానాడులో భాగంగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. 16న అనకాపల్లిలో నియోజకవర్గాల వారీ సమీక్షలు నిర్వహించనున్నారు. అలాగే 17న చీపురుపల్లిలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.

Follow Us
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు