Polavaram Project: పరుగులు పెడుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు.. ఇప్పటి వరకు ఎంతమేర ప్రాజెక్టు పూర్తయ్యిందంటే..
Polavaram Project: ఏపీ ప్రజల జీవనాడి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్.. మేఘా నిర్మాణంలో పోలవరం పరుగులు..
Polavaram Project: ఏపీ ప్రజల జీవనాడి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్.. మేఘా నిర్మాణంలో పోలవరం పరుగులు పెడుతోంది. రికార్డ్ వేగంతో పనులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ.. లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రాజెక్ట్ గేట్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. మొత్తం 48 గేట్లకు గానూ 34 అమర్చారు. టోటల్ 96 సిలిండర్లలో 56 సిలిండర్ల బిగింపు పూర్తైంది. 24 పవర్ ప్యాక్‌లలో 5 పవర్ ప్యాక్‌లు బిగింపు పూర్తైంది. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను ఎత్తవచ్చు. 10 రివర్ స్లూయిజ్ గేట్లకు గానూ 10 గేట్ల అమరిక పూర్తైనట్లు అధికారులు ప్రకటించారు. 3 రివర్ స్లూయిజ్ గేట్లకు సిలిండర్లను అమర్చారు. ఇప్పటికే 44, 43వ గేట్లను కిందకు, పైకి ఎత్తడంతో ట్రయల్ రన్ విజయవంతమైంది. ముందు 44వ గేటును 6 మీటర్లు పైకి ఎత్తి మళ్లీ 3 మీటర్లు కిందకు దించారు. హైడ్రాలిక్ సిలిండర్ సాయంతో గేటును నిమిషానికి 1.5 మీటరు ఎత్తే అవకాశం ఉంది. 2400 టన్నుల ఒత్తిడిని సైతం తట్టుకునేలా ఈ గేట్ల డిజైన్ చేశారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మిగతా గేట్లను ఎత్తేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయి. ఈ ఏప్రిల్‌లో రేడియల్ గేట్లు, మేలో స్పిల్ వే పనులు పూర్తి కానున్నాయి. జూన్‌లో కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు జరుగుతాయని తాజాగా కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించింది. ఎడమ, కుడి ప్రధాన కాల్వలు 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయి. ఇప్పటికే కీలకమైన స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తయింది. స్లాబ్ మొత్తం పొడవు 11 వందల 28 మీటర్లు. సర్కార్ సహకారంతో రికార్డ్ సమయంలో నిర్మాణం పూర్తి చేయగలిగామని మేఘా సంస్థ తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 9న స్పిల్ వే బ్రిడ్జ్ స్లాబ్ నిర్మాణం మొదలు పెట్టారు. రికార్డు సమయంలో టార్గెట్ రీచ్ అయ్యారు.
Also read: