Corona Virus: ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న మాయదారి కరోనా.. ఏయూలో ఒక్కరోజే 55 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ..
Corona Virus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గిన మాయదారి కరోనా మళ్లీ పెరుగుతోంది. రోజు రోజుకు కరోనా..
Corona Virus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గిన మాయదారి కరోనా మళ్లీ పెరుగుతోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కాగా, తాజాగా ఆంధ్రా యూనివర్సిటీలో ఒక్క రోజే 55 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గురువారం నాడు 800 శాంపిల్స్ సేకరించగా.. 400 మందికి రిపోర్ట్ వచ్చింది. మరో 400 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన వారిలో 55 మందికి పాజిటివ్‌గా వచ్చింది. కాగా, కరోనా వచ్చిన వాళ్లందరినీ ఆయా హాస్టల్స్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు అధికారులు. మిగతావారిని క్వారంటైన్‌కు తరలిస్తామన్నారు. విద్యార్థులందరినీ పరీక్షించి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటామని.. పేరెంట్స్ ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.
Also read:
Narendra Modi in Bangladesh : బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ శతజయంతి ఉత్సవాల్లో మోదీ