Joe Biden: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై జో బైడెన్ కీలక వ్యాఖ్యలు.. మరి ట్రంప్ ఏమన్నారంటే..
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికలపై ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు.
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికలపై ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఆయన తొలిసారిగా మీడియా సమావేశంలో పాల్గొన్న బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారు. ‘రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయడమే నా ప్రణాళిక. అదే నా అంచనా కూడా’ అని మీడియా సమావేశంలో బైడెన్ వెల్లడించారు. అంతేకాదు అప్పుడు కూడా ఉపాధ్యక్షురాలిగా మళ్లీ కమలా హ్యారిసే పోటీ చేస్తారని బైడెన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బైడెన్‌కు 78 ఏళ్లు. అంటే 2024 నాటికి ఆయన 82 ఏళ్లకు చేరుకుంటారు. ఇప్పటికే ఆయన అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించిన అధ్యక్షుల్లో వయోవృద్ధుడిగా రికార్డుకెక్కారు.
ఇక బైడెన్ 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని చెప్పడంతో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తలపడబోతున్నారా..? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి అప్పటికీ ఇంకా రిపబ్లికన్ పార్టీ ఉంటుందని మీరు అనుకుంటున్నారా..? అంటూ చమత్కరించారు. కాగా, ఈ సమావేశానికి కేవలం 30 మంది మీడియా ప్రతినిధులను మాత్రమే అవకాశం కల్పించింది శ్వేతసౌధం సిబ్బంది. ఇక జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడటం కూడా తొలిసారే.
ఇవీ కూడా చదవండి: Imrankhan: ఇమ్రాన్ ఖాన్… ఇప్పటికైనా మీకు అర్థమైందా…? అంతర్జాతీయంగా అప్రతిష్టతను మూటగట్టుకుంటున్న పాకిస్థాన్
Indian Ambassador: కువైట్‌లో భారత రాయబారి కీలక ప్రకటన.. పది రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేత