PM Narendra Modi: నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులకు శ్రీకారం..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ఏపీలోని విశాఖపట్నం నగరానికి రానున్నారు. నవంబరు 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ఏపీలోని విశాఖపట్నం నగరానికి రానున్నారు. నవంబరు 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ నవీకరణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వివరాలు అందినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టనున్న మరికొన్ని ప్రాజెక్టులకు, పూర్తయిన అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. అంనతరం వైజాగ్‌లో జరగనున్న బహిరంగ సభలో కూడా ప్రధాని ప్రసంగించనున్నారు.
కాగా.. ఈ బహిరంగ సభను ఆంధ్రా యూనివనర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయాలని యంత్రాంగం భావిస్తోంది. ప్రధాని పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన, చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, ఇతర అధికారులు మంగళవారం ప్రాథమికంగా చర్చించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో కూడా నూతనుత్సాహం నెలకొంది.
డిసెంబరులో రాష్ట్రపతి పర్యటన..




రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము డిసెంబరులో విశాఖలో పర్యటించనున్నారు. డిసెంబరు 4న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నౌకా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారని సమాచారం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..




