AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephants at Tirupathi: తిరుపతి జిల్లాలో ఏనుగుల సంచారం.. భయంతో వణికిపోతున్న ప్రజలు

తిరుపతి(Tirupathi) జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు భయంతో హడలిపోతున్నారు. రేణిగుంట(Renigunta) మండలం నాయుడుపేట తిరుపతి జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న రామకృష్ణపురంలో అర్ధరాత్రి ఏనుగులు సంచరించాయి...

Elephants at Tirupathi: తిరుపతి జిల్లాలో ఏనుగుల సంచారం.. భయంతో వణికిపోతున్న ప్రజలు
Elephants Wandering
Ganesh Mudavath
|

Updated on: Apr 06, 2022 | 9:46 PM

Share

తిరుపతి(Tirupathi) జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు భయంతో హడలిపోతున్నారు. రేణిగుంట(Renigunta) మండలం నాయుడుపేట తిరుపతి జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న రామకృష్ణపురంలో అర్ధరాత్రి ఏనుగులు సంచరించాయి. జనావాసాల మధ్య తిరుగుతూ భయాందోళన కలిగించాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. రామకృష్ణనగర్, వసుంధరనగర్, తూకీవాకం ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఏనుగులు(Elephants) సంచరించం కలకలం రేపుతోంది. ఏప్రిల్‌ 4న ఏనుగులు రామకృష్ణానగర్‌లో సంచరించాయి. ఓ వ్యక్తి ఇంటి బయట కుర్చీలో కూర్చొని ఉండగా ఆయన వెనక నుంచి ఏనుగులు వచ్చాయి. కుక్క అదే పనిగా అరుస్తుండటంతో వెనక్కి చూసిన ఆ వ్యక్తి ఏనుగులను చూసి భయంతో పరుగులు తీశాడు. ఈ ఘటన తరవాత అటవీ శాఖ అధికారులు, గాజులమండ్యం పోలీసులు రంగంలోకి దిగారు. రేణిగుంట సమీపంలో అటవీ ప్రాంతం ఉండటంతో ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పొలాలవైపు వెళ్లాలంటేనే వారు భయపడిపోతున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఏనుగులు తిరిగి తమ గ్రామాల్లో రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read

Team India: అవమానాలు ఎన్నొచ్చినా బ్యాట్‌తోనే చెక్.. టీమిండియా చరిత్రలో ఈయన రూటే సెపరేటు..

lady Finger Benefits: బెండకాయలు తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..

K.G.F: Chapter 2: కేజీఎఫ్ ఛాప్టర్ 2 నుంచి మరో పాట.. ఆకట్టుకుంటున్న ‘ఎదగరా’ సాంగ్

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..