AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పింఛన్ డబ్బు తీసుకుని ప్రియురాలితో పరార్.. జల్సాలకు జనాల సొమ్ము కాజేసిన వాలంటీర్

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల(Volunteer) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించేలా వారికి బాధ్యతలు అప్పగించారు. వీరి సహాయంతో రాష్ట్రంలో 95 శాతానికి పైగా...

Andhra Pradesh: పింఛన్ డబ్బు తీసుకుని ప్రియురాలితో పరార్.. జల్సాలకు జనాల సొమ్ము కాజేసిన వాలంటీర్
Money
Ganesh Mudavath
|

Updated on: Apr 06, 2022 | 7:12 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల(Volunteer) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించేలా వారికి బాధ్యతలు అప్పగించారు. వీరి సహాయంతో రాష్ట్రంలో 95 శాతానికి పైగా పెన్షన్లను(Pensions) పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అంతే కాకుండా గ్రామస్థాయిలో జరిగే పనులనూ వాలంటీర్లే చేస్తున్నారు. దీనిని అలుసుగా తీసుకుంటున్న కొందరు వాలంటీర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. జనాలకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులను జేబులో వేసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా (Guntur District) లో ఓ వాలంటీర్ పెన్షన్ డబ్బు తీసుకొని, ప్రియురాలితో కలిసి ఉడాయించాడు. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలోని మూగచింతలపాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

ప్రతినెల 1వ తేదీనే రావాల్సిన పెన్షన్ ఇంకా రాకపోవడంతో ఆ వార్డులోని వాలంటీర్లంతా సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన సచివాలయ సిబ్బంది ఆరా తీయగా సదరు వాలంటీర్ ఆ డబ్బులను తీసుకొని ప్రియురాలితో వెళ్లిపోయినట్లు తేలింది. దీంతో గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఆయనే ఆ మొత్తాన్ని చెల్లించాడు. దీంతో సిబ్బంది ఆ డబ్బును పెన్షన్ల కింద పంపిణీ చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే.. ప్రియురాలితో కలిసి పారిపోయిన వాలంటీర్ కు అప్పటికే పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనపై యువతి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read

Big News Big Debate: తమిళసైని కక్షకట్టి మరీ అవమానిస్తున్నారా? గవర్నర్‌ ఢిల్లీ టూరులో ఫిర్యాదులే అజెండానా?

LSG vs DC, IPL 2022 Match Prediction: కీలక ఆటగాళ్ల చేరికతో బలపడిన ఇరుజట్లు.. లక్నో వర్సెస్ ఢిల్లీ పోరులో విజేతలెవరో?

Telangana Jobs 2022: తెలంగాణ గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్‌ కూడా! వెంటనే దరఖాస్తు..