New Year Offer: ఐదు పైసల నాణెం ఇస్తే బిర్యానీ.. రెస్టారెంట్ ముందు భారీ క్యూ.. బెడిసికొట్టిన న్యూ ఇయర్ ఆఫర్..
డిసెంబర్ 31. ఏడాదిలో చివరి రోజు.. నిన్న (శనివారం) ఆ సందడి మామూలుగా లేదు. విందు, వినోదాలతో ప్రజలు మునిగితేలారు. అంతే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్ ల యాజమాన్యాలు ఆఫర్లు ప్రకటించాయి. ప్రత్యేక..

డిసెంబర్ 31. ఏడాదిలో చివరి రోజు.. నిన్న (శనివారం) ఆ సందడి మామూలుగా లేదు. విందు, వినోదాలతో ప్రజలు మునిగితేలారు. అంతే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్ ల యాజమాన్యాలు ఆఫర్లు ప్రకటించాయి. ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఓ రెస్టారెంట్ ఇచ్చిన ఆఫర్.. వారిని ఇబ్బందుల్లో ముంచెత్తింది. 5 పైసల నాణెం తీసుకొస్తే.. బిర్యానీ ఇస్తామన్న ఆఫర్ బెడిసి కొట్టింది. ఊహించనంత మంది ప్రజలు రావడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. నంద్యాల పట్టణంలోని క్లాసిక్ జైల్ రెస్టారెంట్ నిర్వాహకులు.. వినూత్న ఆఫర్ ప్రకటించారు. పాత 5 పైసల నాణెం ఇస్తే బిర్యానీ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు.
విషయం తెలుసుకున్న ప్రజలు.. దీని కోసం 5 పైసల నాణేలు తీసుకొచ్చారు. గుంపులు గుంపులుగా రావడంతో రెస్టారెంట్ ముందు వందల మంది క్యూ కట్టారు. ప్రజలు భారీగా తరలిరావటంతో రహదారిలో ట్రాఫిక్ జామ్ అయింది. బిర్యానీ కోసం జనాల మధ్య తోపులాట జరిగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. జనాలను అక్కడి నుంచి పంపించారు. రెస్టారెంట్‌కు పోలీసులు తాళం వేశారు. ఇందుకు కారణమైన రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి