Pawan Kalyan: రాజకీయ పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సీఎం పదవి అడిగే హక్కు లేదంటూ..
Pawan Kalyan: తెలుగు దేశం పార్టీ నేతలను ముఖ్యమంత్రి చేసేందుకు జనసేన లేదని, కుల రాజకీయాలు చేయనని ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పొత్తులు కూడా రాజకీయంలో భాగమేనని, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని తేల్చి..
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పొత్తుల దిశగానే నడుస్తున్నాయి. ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందని తెలిసిపోయింది. ఈ క్రమంలో బీజేపీతో కూడా పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ కార్యలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పొత్తులపై, రానున్న ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీ నేతలను ముఖ్యమంత్రి చేసేందుకు జనసేన లేదని, కుల రాజకీయాలు చేయనని పవన్ కళ్యాణ్ అన్నారు. పొత్తులు కూడా రాజకీయంలో భాగమేనని, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని, ఆ పార్టీకి మళ్లీ ఓటు వేస్తే రాష్ట్రం ఇప్పట్లో కోలుకోలేదని, తమకు ఉమ్మడి ప్రత్యర్థి వైసీపీనేనని పేర్కొన్నారు.
‘‘నా స్టార్‌డమ్‌తో సింగిల్ డేలో ఏదో అయిపోదామని అనుకోలేదు. కష్టపడితే అనుకున్నది సాధించగలమనని తెలుసు. రామారావుగారికి అప్పట్లో జరిగింది, నాకు కూడా ఇప్పుడు కుదురుతుంది అని అనుకోవడంలేదు. ఏపిలోని మెజారిటీ ప్రజలను రక్షించడానికి నేను కొంతమందికి టార్గెట్ అవుతాను. అయినా భయపడను.. అన్నిటికీ సిద్దంగానే ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల వేళ మన బలం ఏమిటో ముందుగా బేరీజు వేసుకోవాలి. మనం ఏమి చేసినా నిర్మాణాత్మకంగా చెయ్యాలి. అవసరమైతే తగ్గడమే కాదు.. అవసరం వచ్చినప్పుడు బెబ్బులిలా తిరగబడాలి. గజమాలలు వేస్తే సీఎంలు కారు.. ‘సీఎం సీఎం’ అని కేకలు వేస్తే సీఎంలు కాము.. ఓట్లు వేస్తేనే అవుతాం. ’’ అని అన్నారు.
ఇంకా ‘‘హైదరాబాద్‌లో ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. కానీ ఏపీలో మాత్రం జనసేనకు ఆ సీట్లు కూడా రాలేదు. జనసేనకు సంఖ్యా బలం ఉన్నా ఓట్లు మాత్రం వెయ్యడం లేదు. ఈ పరిస్థితుల్లో పొత్తులతో ముందుకెళ్లడమే తప్ప సీఎం పదవిని అడిగే హక్కు మనకు లేద’ని పవన్ పేర్కొన్నారు. అలాగే ‘‘మండల స్థాయికి, డివిజన్ స్థాయికి నేనే లీడర్‌గా ఉండాలని ప్రజలు అనుకుంటే.. మరో పార్టీ నాయకుడు, ఇంకో పార్టీ నేతను సీఎం చేయాలని నేను ఎందుకు అనుకుంటాను..? 2009లో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన 18 స్థానాలు కూడా జనసేనకు రాలేదు. మరి వైసీపీకి జనసేన అంటే ఎందుకు భయం..?’ పవన్ అధికార పార్టీని ప్రశ్నించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి