Andhra Pradesh: ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో హీటెక్కిన రాజకీయం.. ‘పొత్తు’లపై కత్తులు దూస్తున్న నేతలు..!
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కుతోంది. పొత్తులపై ఒకరు మాట్లాడుతుంటే.. పార్టీల కలయికపై అధికారపక్షం విరుచుకుపడుతోంది. ఇప్పటికే చంద్రబాబు రైతులను పరామర్శించడం పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో పొత్తులపై పవన్ కల్యాణ్ మాట్లాడటం వాడీవేడీ చర్చను రాజేస్తోంది.

బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. అయినప్పటికీ ఆయన చూపు ఎక్కడుందో? ఆయన ఎవరితో పొత్తు కోరుకుంటున్నారో..? పవన్ కల్యాణ్ మాటలు చెప్పకనే చెబుతున్నాయి. పొత్తులపై ముందు నుంచీ పవన్ కల్యాణ్‌ది ఒకటే మాట. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పదే పదే రిపీట్ చేస్తున్నారు.
ఇక విపక్షాల కదలికలను నిశితంగా గమనిస్తున్న అధికారపక్షం.. ధీటుగానే జనాల్లోకి వెళ్తోంది. ఈ అంశంపై కావలి సభలో తీవ్రంగానే స్పందించారు సీఎం జగన్. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను అస్సలు ఉపేక్షించడం లేదు సీఎం జగన్. గతంలో చంద్రబాబు ఏం చేశారు? వాటివల్ల రైతులకు, ప్రజలకు కలిగిన కష్టాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే ఏం జరుగుతుందో జనం ఆలోచించాలంటున్నారు సీఎం జగన్.
చంద్రబాబు పాలేరుగా పవన్..
చంద్రబాబుకు పవన్‌కల్యాణ్ పాలేరుగా ఉన్నారని విమర్శించారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు కాళ్ల దగ్గర పార్టీని తాకట్టు పెట్టారని విమర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది కలిసొచ్చినా.. వైసీపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీవో 1పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు మంత్రి జోగి రమేష్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..