AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు.. తొలి సంతకం దేనిపైన అంటే..?

ఇన్నాళ్లు అభిమానులకు పవర్‌ స్టార్‌గా, తన కార్యకర్తలకు జనసేన అధినేతగానే పాపులర్‌ అయిన పవన్‌ కల్యాణ్‌, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం జూన్ 19న జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు

Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు.. తొలి సంతకం దేనిపైన అంటే..?
Dy Cm Pawan Kalyan
Balaraju Goud
|

Updated on: Jun 19, 2024 | 1:34 PM

Share

ఇట్స్‌ అఫీషియల్‌. ఇన్నాళ్లు అభిమానులకు పవర్‌ స్టార్‌గా, తన కార్యకర్తలకు జనసేన అధినేతగానే పాపులర్‌ అయిన పవన్‌ కల్యాణ్‌, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం జూన్ 19న జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు.

క్యాంప్‌ ఆఫీస్‌లో సరిగ్గా ఉదయం 10గంటల 47 నిమిషాలకు తన క్యాంప్‌ ఆఫీస్‌లో బాధ్యతలు స్వీకరించారు పవన్‌ కల్యాణ్‌. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇంద్రకీలాద్రి ఆలయ వేదపండితుల ఆశీర్వచనం అందించారు. బాధ్యతలు స్వీకరించగానే ఫైళ్లమీద పవన్‌ సంతకాలు చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ అవుతారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్, రెండు ఫైళ్ళపై సంతకాలు చేశారు. మొదటి ఫైల్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు కోసం తొలి సంతకం చేశారు. అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌పై రెండో సంతకం చేశారు.

వీడియో ఇదిగో…

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌ కల్యాణ్‌కు జనసేన, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు, నాదెండ్ల మనోహర్‌ తదితరులు పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ