Andhra Pradesh: ఏపీలో బీభత్సం సృష్టించే ఏనుగుల సమస్యకు చెక్‌

పలు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తోన్న అడవి ఏనుగుల ఎపిసోడ్‌కు ఏపీ సర్కార్‌ చెక్‌ పెడుతోంది. బెంగళూరు వేదికగా ఏనుగుల సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌. ఇంతకీ.. అడవి ఏనుగుల సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు పవన్‌‌ ఎలాంటి చర్యలు తీసుకున్నారు?...

Andhra Pradesh: ఏపీలో బీభత్సం సృష్టించే ఏనుగుల సమస్యకు చెక్‌
Andhra Pradesh Deputy Chief Minister K Pawan Kalyan (right) with Karnataka Forest Minister Eshwar B Khandre
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 08, 2024 | 6:55 PM

ఏపీలోని చిత్తూరు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగులు తరచూ బీభత్సం సృష్టిస్తుంటాయి. గుంపులు గుంపులుగా గ్రామాల్లోకి వస్తూ పంట పొలాలను నాశనం చేయడంతోపాటు.. మనుషుల ప్రాణాలను కూడా తీస్తుంటాయి. ఇలాంటి ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమివేసేందుకు అటవీశాఖ అనేక చర్యలు చేపట్టింది. కానీ.. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ఏనుగుల సమస్య అటవీశాఖ అధికారులకు పెద్ద టాస్క్‌గా మారుతోంది. దాంతో.. ఏనుగుల బీభత్సకాండపై కూటమి సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ఎలాగైనా ఏనుగుల సమస్యకు చెక్‌ పెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. కుంకీ ఏనుగులతో వాటిని తరిమివేయొచ్చని అధికారులు చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేసింది. కుంకీ ఏనుగుల కోసం అన్వేషణ మొదలు పెట్టి.. కర్నాటకలో ఉన్నట్లు తెలుసుకున్నారు. వాటిని ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

దానిలో భాగంగానే.. బెంగళూరులో పర్యటించిన అటవీశాఖ మంత్రిగా ఉన్న.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌.. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్‌తో భేటీ అయి.. ఏడు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా.. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లోని ఏనుగుల బెడదను కర్నాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ బీ ఖండ్రే దృష్టికి తీసుకెళ్లారు. ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి పంటలను నాశనం చేయడంతోపాటు.. ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ఆయనకు తెలియజేశారు. గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దాంతో.. కర్నాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కర్నాటక అటవీశాఖ మంత్రి- పవన్‌కళ్యాణ్‌ సమావేశం తర్వాత.. ఏపీకి ఎనిమిది కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు అంగీకరించింది కన్నడ ప్రభుత్వం. ఇక.. ఈ కుంకీ ఏనుగులు అనేవి శిక్షణ పొందిన ఏనుగులు. వీటిని అడవి ఏనుగులను ట్రాప్‌ చేయడానికి వినియోగిస్తారు. ఈ క్రమంలోనే.. గ్రామాల్లోకి వచ్చే ఏనుగులను కుంకీ ఏనుగుల ద్వారా తరిమివేస్తారు అటవీశాఖ అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..